విధాత : సెలూన్ షాపు కు వెళ్లి..షాప్ నిర్వాహకుడిపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఎస్ఐ చందర్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కరీంనగర్ ఖాన్ పురాలోని న్యూ ప్రజా హెయిర్ స్టైల్ సెలూన్ కు త్రీటౌన్ ఎస్సై చైతన్య చందర్ వెళ్లి తనకు కటింగ్ చేయాలని కోరాడు. ఆ సమయంలో షాప్ ను క్లీన్ చేస్తున్న సెలూన్ షాపు నిర్వాహకుడు పగడాల రాము ఎస్సైని చూసి మర్యాదపూర్వకంగా అన్నా కూర్చో అని కొంచెం ఆగండి అని బదులిచ్చాడు. నన్ను అన్నా అంటావురా..సార్ అని పిలువాలంటూ కోపంతో బూతులతో రెచ్చిపోయి నాయి బ్రాహ్మణుడు రాములుపై చందర్ చేయి చేసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీస్ శాఖ అప్రతిష్ట తెచ్చేదిగా తయారైంది. నాయి బ్రహ్మణ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని లేనట్లయితే నిరసనలు చేపడుతామని ప్రకటించాయి. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ చందర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరని, సామాన్య ప్రజలతో దురుసుగా ప్రవర్తించినా, చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసినా సహించేది లేదని సీపీ గౌష్ ఆలంహెచ్చరించారు.
ఎస్ఐ వీరంగం.. సెలూన్ షాప్ నిర్వాహకుడిపై దాడి
కరీంనగర్‌లోని ఖాన్పురాలో వెలుగు చూసిన ఘటన
షేవింగ్ చేయించుకోవడం కోసం సెలూన్‌కి వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్
‘అన్నా కూర్చో’ అని షాప్ నిర్వాహకుడు రాము చెప్పడంతో ఎస్ఐ ఆగ్రహం
‘అన్నా ఏందిరా’ అంటూ బూతులు తిడుతూ.. రాముపై ఎటాక్ చేసిన ఎస్ఐ… pic.twitter.com/2ojb27oe4x
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 25, 2026
