మందు చల్లి…నారు వేసి పొలం పనుల్లో : ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లారు
విధాత, హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లారు. అనంతరం మహిళా కూలీలకు నాట్లు వేసేందుకు అవసరమైన నారు అందచేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి పనిచేయడం చూసిన కూలీలు ఆయన వ్యవహారశైలిని అభినందించారు. ఎమ్మెల్యే వీరేశం అధికార దర్పానికి దూరంగా సాధారణ రైతు మాదిరిగా పొలంలో పనిచేయడంతో పాటు నియోజవర్గం ప్రజలను నిత్యం కలుస్తు, వారి మంచిచెడుల కార్యక్రమాలకు హాజరవుతు అందుబాటులో ఉంటుండటం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి 2014ఎన్నికల్లో బీఆరెస్ నుంచి గెలిచిన వీరేశం 2018ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2023ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram