విధాత,హైదరాబాద్: విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ విద్యార్థులు సబిత ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి… లేదా.. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యార్థులు ఆమెకు వినతి పత్రం ఇచ్చారు. ఓయూ నుంచి సబిత ఇంద్రారెడ్డి నివాసం వరకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు.