Summer Camps | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 757 స‌మ్మ‌ర్ క్యాంప్స్.. వివ‌రాలివే..!

Summer Camps | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని విద్యార్థుల‌కు శుభవార్త‌. ఈ ఎండాకాలంలో విద్యార్థుల‌కు స‌మ్మ‌ర్ క్యాంప్స్ నిర్వ‌హించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధ‌మైంది. మొత్తం 37 రోజుల పాటు 44 క్రీడా విభాగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

  • By: raj |    telangana |    Published on : Apr 26, 2026 12:09 PM IST
Summer Camps | విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 757 స‌మ్మ‌ర్ క్యాంప్స్.. వివ‌రాలివే..!

Summer Camps | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని విద్యార్థుల‌కు శుభవార్త‌. ఈ ఎండాకాలంలో విద్యార్థుల‌కు స‌మ్మ‌ర్ క్యాంప్స్ నిర్వ‌హించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధ‌మైంది. మొత్తం 37 రోజుల పాటు 44 క్రీడా విభాగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. న‌గ‌రంలోని 752 కేంద్రాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు జీహెచ్ఎంసీ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 25 నుంచి మే 31 వ‌ర‌కు స‌మ్మ‌ర్ క్యాంప్స్ కొన‌సాగ‌నున్నాయి.

వీరికే అవ‌కాశం..

ఈ స‌మ్మ‌ర్ క్యాంపుల్లో 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

క్యాంప్స్‌లో నిర్వహించే ప్రధాన క్రీడలు:

అథ్లెటిక్స్, ఆత్యా పత్యా, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్‌బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖో ఖో, కార్ఫ్‌బాల్, మల్ఖాంబ, నెట్‌బాల్, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్‌బాల్, స్విమ్మింగ్, సెపక్ టక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికోయిట్, తైక్వాండో, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ (ఇండియన్, రోమన్), వుషు, యోగా, త్రోబాల్, కిక్ బాక్సింగ్, ముయ్ థాయ్, స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్‌బాల్, క్యారమ్స్.

ఈ క్రీడల్లో పాల్గొనదలచిన విద్యార్థులు GHMC ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇందుకు సంబంధించి sports.ghmc.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని సభ్యత్వ రుసుము చెల్లించాలి.

దీంతో పాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్‌లో భాగంగా మే 5 నుండి మే 11 వరకు జోన్ వారీగా స్పోర్ట్స్ క్విజ్ పోటీలు నిర్వహించబడతాయి. అలాగే మే 18 నుండి మే 23 వరకు 16 క్రీడల్లో క్యాంప్/జోన్ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా GHMC చర్యలు చేపడుతోంది.