సురవరం భౌతిక కాయం గాంధీ ఆసుపత్రికి అప్పగింత

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అందించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీఐ కార్యాలయం మగ్ధూం భవన్ లో సురవరం సుధాకర్ రెడ్డి పార్థీవ దేహన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు

సురవరం భౌతిక కాయం గాంధీ ఆసుపత్రికి అప్పగింత

విదాత, హైదరాబాద్: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అందించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీఐ కార్యాలయం మగ్ధూం భవన్ లో సురవరం సుధాకర్ రెడ్డి పార్థీవ దేహన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు సురవరం పార్థీవదేహానికి నివాళులర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సీపీఐ కార్యకర్తలు, నాయకులు సురవరం సుధాకర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. మగ్దూం భవన్ వద్ద పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మగ్ధూం భవన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించారు. సురవరం సుధాకర్ రెడ్డి పోరాటాలు, ఆయన చరిత్రను గుర్తు చేస్తూ అంతిమ యాత్ర పొడవున ప్రజా నాట్యమండలి కళాకారులు పాటలు పాడారు. గాంధీ ఆసుపత్రికి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. మగ్ధూం భవన్ వద్ద కుటుంబ సభ్యులకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి మరణించారు.