TELANGANA | ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ .. బడ్జెట్‌కు ఆమోదం

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈనెల 25న జరుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం సమావేశం నిర్వహించనున్నారు.

TELANGANA | ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ .. బడ్జెట్‌కు ఆమోదం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ఈనెల 25న జరుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీలో 2024-25పూర్తి స్థాయి బడ్జెట్ కి ఆమోదం తెలపడంతో పలు కీలక నిర్ణయాలను ఆమోదించనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది. 24నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సీ.పీ.రాధాకిషన్ అధికారిక నోటిఫికేషన్‌ సైతం వెలువరించారు. 23వ తేదీ ఉదయం 11గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ నెల 25 లేదా 26తేదీలలో ఒక రోజున రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పూర్తి చేశారు. శాఖల వారిగా కేటాయింపులపై నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశముందని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. శాసన సభ ఈ ప‌ది రోజుల సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, జాబ్ క్యాలెండర్, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం చర్చించే అవకాశముంది. అలాగే బీసీ గణన, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగవచ్చు. ప్రతిపక్షం వైపు నుంచి పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల సమస్యలు, పోటీ పరీక్షల వాయిదా, రైతు రుణమాఫీ, భరోసా పథకాల అమలు లోపాలు, ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపై చర్చకు పట్టుపట్టవచ్చంటున్నారు విశ్లేషకులు. కాళేశ్వరం , విద్యుత్తు కమిషన్ల విచారణలపై కూడా చర్చలకు అవకాశముంది.