విధాత: తెలంగాణ శాసన సభ ఎన్నికలలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీల మధ సాగుతున్న ప్రచార యుద్ధం రోజురోజుకు కొంత పుంతలు తొక్కుతుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రేమలో బీఆరెస్, బీజేపీలు అంటూ ట్వీట్టర్ వేదిగా చేపట్టిన ప్రచారం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బీజేపీ బీఆరెస్‌ల లగ్గం పిలుపు ..దానికి ట్యాగ్‌లైన్‌గా తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో.. ముహుర్తం 2023సార్వత్రిక ఎన్నికల్లో..నక్షత్రం కవితపై కరుణ నక్షత్రంలో..పిలిశెటోళ్లు మోడీ, కేసీఆర్, తెలంగాణ మంత్రులు అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇందులో లగ్గం వేడుక రాజకీయ బాగోతమేసే వారి ఇంట…కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా జరుగుతుందని, అర్సుకునేటోళ్లుగా కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, అర్వింద్‌ల పేర్లు పేర్కోన్నారు. మా పార్టీ లగ్గంను తెలంగాణ ప్రజలందరూ సూడాలే అని, నాకు నువ్వు బీఆరెస్, నీకు నేను బీజేపీ.. లోపాయికారి ఒప్పందం మాది అని ముద్రించారు. ఇంతకీ బీఆరెస్‌కి బీజేపీ ఇస్తున్న కట్నం ఎంటో తెలుసా అని లిక్కర్ స్కాంలో కవితమ్మను అరెస్టు కాకుండా అభయం.. కట్నమని పెండ్లీ పత్రికల్లో పేర్కోన్నారు.
సప్తపదిలో మొదటి అడుగుగా నోట్ల రద్దులో ఒకరికి ఒకరు మద్దతు, రెండో అడుగుగా కాళేశ్వరం కుంభకోణానికి మోడీ అండా, మూడో అడుగుగా పెట్రోల్, డీజీల్, గ్యాస్ పై ట్యాక్స్‌ల కుంభకోణం, నాలుగో అడుగుగా ధరణితో తెలంగాణల భూముల కుంభకోణం, ఐదో అడుగుగా లక్ష ఉద్యోగాలని కేసీఆర్, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలని మోడీల నయవంచన, ఆరో అడుగుగా పేపర్ లీకేజీపై సీబీఐ ఎంక్వయిరీ వేయకపోవడం, ఏడో అడుగుగా బండి సంజయ్ అధ్యక్ష పదవిని పీకేసి కిషన్‌రెడ్డి చేతిలో పెట్టడం అని పేర్కోన్నారు. ఇట్లు బీఆరెస్, బీజేపీ మిత్రుల అభినందనలతో అంటూ ముద్రించిన ఈ పెండ్లీ పత్రికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీల ప్రచారాన్ని మరింత రచ్చగా మార్చనున్నాయి.
ప్రేమలో… బీఆర్ఎస్❤️బీజేపీ.#BRSLovesBJP pic.twitter.com/Y8qBq2j3e4
— Telangana Congress (@INCTelangana) October 25, 2023