తెలంగాణ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు : మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Apr 26, 2026, 12:34 pm IST
Read Time: 3 mins
తెలంగాణ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు : మంత్రి పొన్నం

విధాత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది అన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని పొన్నం వెల్లడించారు.