SC Reservations | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! 60 రోజుల తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) ఉద్యోగ నోటిఫికేషన్ల( Job Notifications ) జారీ ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) ఉద్యోగ నోటిఫికేషన్ల( Job Notifications ) జారీ ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ రిజర్వేషన్ల( SC Reservations ) అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశించారు.
SC Reservations | హైదరాబాద్ : ఎస్సీ రిజర్వేషన్ల( SC Reservations )వర్గీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు( Supreme Court ) తీర్పు అమలు కోసం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్( Onemen Commission )ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్సీ రిజర్వేషన్లపై 60 రోజుల్లో ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు( Job Notifications ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ల అమలుకు 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకోవాలన్నారు. ఇక కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లను 24 గంటల్లో పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ఏకసభ్య కమిషన్ నివేదికను సమర్పించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ( Manda Krishna Madiga ) ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఎల్బీ స్టేడియంలో ఉపాద్యాయ నియామక పత్రాలు ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రిక ఎలా చేపడుతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయడానికే మాలలతో కుమ్మక్కై మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు, మాదిగల వాటా తేలే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరపొద్దని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.