Minister Damodar Rajanarsimha | తెలంగాణ వైద్య శాఖ మంత్రికి వైరల్ ఫీవర్ !
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వైరల్ ఫీవర్ సోకడంతో చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రంలో విషజ్వరాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వైరల్ ఫీవర్ సోకింది. దీంతో దామోదర రాజనర్సింహ వైద్య చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రంలో ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలు, వాతావరణం చల్లబడడంతో దోమలు పెరిగిపోయాయి. మరోవైపు వైరల్ జ్వరాలు కూడా విస్తరిస్తున్నాయ. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా డెంగ్యూ, 300వరకు చికెన్ గున్యా కేసులే కాకుండా మలేరియా కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల మంది వరకు పలు రకాల జ్వరాల బారినపడ్డారు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ హాస్పిటల్స్ కు సంబంధించినవే. ప్రైవేట్ ఆస్పత్రుల లెక్కలు కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram