TGSPDCL | టిజిఎస్​పిడిసిఎల్​లో ప్రమోషన్ల జాతర

తెలంగాణ దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థ తన ఉద్యోగులకు  భారీ ఎత్తున పదోన్నతులు ప్రకటించింది. దాదాపు 2200 మంది ఉద్యోగులకు పైగా ఈ ప్రమోషన్లు లభించాయి.

TGSPDCL | టిజిఎస్​పిడిసిఎల్​లో ప్రమోషన్ల జాతర

తెలంగాణ విద్యుత్​ దక్షిణ పంపిణీ సంస్థ(TGSPDCL) తమ ఉద్యోగుల పదోన్నతుల విషయమై తీపి కబురు వినిపించింది.  సంస్థవ్యాప్తంగా 2263 మందికి ప్రమోషన్లు(Promotions to 2263 employees) కల్పించింది. ఈ విషయమై సంస్థ ఒక ప్రకటన చేసింది. ఇందులో 16 మంది పి అండ్​ జి(P&G) ఆఫీసర్లు కాగా, 47 గురు అకౌంట్స్​నుండి, 2099 మంది ఉద్యోగులు ఆపరేషన్స్​ అండ్​ మెయిన్​టెనెన్స్(O&M)​ నుండి ఉన్నారు.

కంపెనీ ఛైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారుఖీ(Musharraf Ali Faruqui) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. కంపెనీ మేనేజ్​మెంట్​ ఈ సందర్భంగా జూనియర్​ లైన్​మెన్​(Junior Lineman) నుండి చీఫ్​ జనరల్​ మేనేజర్​(CGM) స్థాయి వరకు పదోన్నతులు కల్పించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 101 మంది ఇంజనీరింగ్(Engineering)​ విభాగంలో, 47మంది అకౌంట్స్​లో, 2099మంది ఆపరేషన్స్​ అండ్​ మెయిన్​టెనెన్స్​లో, పదహారుగురు పి అండ్​ జి నుండి ప్రమోషన్లు పొందినట్లు తెలిసింది.

మరిన్ని వివరాల్లో, ఇద్దరు సూపరింటెండెంట్​ ఇంజనీర్లు(SE) చీఫ్​ ఇంజనీర్లు(CE)గా, ఒక జనరల్​ మేనేజర్(GM)​, జాయింట్​ సెక్రటరీ(JS)గా పదోన్నతి పొందారు. ఇంకా 8మంది డివిజనల్​ ఇంజనీర్ల(DE)ను  సూపరింటెండెంట్​ ఇంజనీర్లు(SE)గా, 30మంది ఏడీఈ(ADE)లను డీఈ(DE)లుగా, 58 మంది ఏఈ(AE)/ఏఈఈ(AEE)లను ఏడీఈ(ADE)లుగా ప్రమోషన్​ ఇచ్చారు. మరో 1650 జూనియర్​ లైన్​మన్ల(JLM)కు అసిస్టెంట్​ లైన్​మన్లు(ALM)గా పదోన్నతి కల్పించారు.

ఈమధ్యే ఈ పదోన్నతుల విషయమై ఉపముఖ్యమంత్రి, విద్యుత్​ శాఖా మంత్రి కూడా అయిన మల్లు భట్టి విక్రమార్క(DCM Mallu Bhatti Vikramarka) దృష్టికి తేగా, ఆయన సత్వరమే స్పందించి, సాధ్యమైనంత త్వరగా ప్రమోషన్ల విషయాన్ని పరిష్కరిచాల్సిందిగా సిఎండీని ఆదేశించారు. దాని ఫలితమే నేటి ఈ ఉత్తర్వులు. ఈ ప్రమోషన్లు 2017వ సంవత్సరం నుండి పెండింగ్​(pending)లో ఉండగా, చాలామంది అర్హులైన ఉద్యోగులు పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేసారు. సిఎండీ ఫారుఖీ మాట్లాడుతూ, ఈ పదోన్నతుల వల్ల ఖాళీ అయిన స్థానాలను భర్తీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేసారు.