Telangana | తెలంగాణ ఉద్యమ సారధికి నిజమైన గుర్తింపు.. ప్రొఫెసర్ కోదండరాం కు మంత్రి పదవి ఇవ్వండి
ప్రొఫెసర్ కోదండరాం కు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ అసోసియేషన్ మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.
శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు
విధాత: ప్రొఫెసర్ కోదండరాం (Prof. Kodandaram)కు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ అసోసియేషన్ మంత్రి పదవి (Minister Post) కూడా ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి (), కే.రామకృష్ణ (), తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్(TGTA) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు, రమేష్ పాకలు కోదండరాం ను కిలిసి అభినందనలు తెలిపారు.
ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పట్ల యావత్ రెవెన్యూ ఉద్యోగుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి, మిగతా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram