Sunkishala incident | సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్.. నలుగురిపై వేటు
సుంకిశాల పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) చర్యలు తీసుకుంది. జలమండలి ఉన్నతాధికారుల నివేదిక మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రాజెక్టు డైరక్టర్ సుదర్శన్‌పై బదిలీ(Transfer on Project Director Sudarshan) వేటు వేసింది.

Sunkishala incident| సుంకిశాల పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) చర్యలు తీసుకుంది. జలమండలి ఉన్నతాధికారుల నివేదిక మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రాజెక్టు డైరక్టర్ సుదర్శన్‌పై బదిలీ(Transfer on Project Director Sudarshan) వేటు వేసింది. ప్రాజెక్టు కన్‌స్ట్రక్చన్ సర్కిల్ 3(Project Construction Circle 3) అధికారులను సస్పెండ్ చేసింది. సీజీఎం కిరణ్‌కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌లను సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ వారిపై చర్యలు తీసుకుంది. సుంకిశాల పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటన(collapse retaining wall of Sunkishala pumphouse) వారం రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. ఘటన సందర్భంగా కార్మికులు పనిలో లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయితే నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్ కూలి పంప్‌హౌజ్‌లు, టన్నెల్ గేట్లు దెబ్బతినడంతో భారీగా ఆస్తి నష్టం, పెట్టిన వ్యయానికి నష్టం వాటిల్లింది. నిర్మాణ సంస్థ మేఘాపై (The production company is Megha)సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మరమ్మతులకు సంబంధించిన 20కోట్లకు పైగా ఖర్చును నిర్మాణ సంస్థనే భరిస్తామని చెప్పడం కొంత ఊరటనిచ్చింది. కాగా నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. నాగార్జున సాగర్ జలాశయం డెడ్‌స్టోేరేజీ 510కి చేరితే ఏకేబీఆర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి పంపింగ్ కోసం అత్యవసర మోటార్లు సాగర్‌లో ఏర్పాటు చేసుకోవాల్సివస్తుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా సాగర్‌లో 450అడుగుల వరకు నీటి నిల్వ ఉన్నా మూడు టన్నెల్స్ ద్వారా నీటిని తీసుకుని లిఫ్టు చేసేందుకు సుంకిశాల పథకాన్ని బీఆరెస్ ప్రభుత్వం చేపట్టింది. 2214కోట్లతో చేపట్టిన ఈ పథకంలో ఇప్పటికే 1500కోట్లు ఖర్చు పెట్టారు.