సింగరేణిలో సద్దుల బతుకమ్మ సంబురాలు: చింతల శ్రీనివాస్

సింగరేణిలో సద్దుల బతుకమ్మ సంబురాలు: చింతల శ్రీనివాస్

విధాత, పెద్దపల్లి: సింగరేణి వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ఆ సంస్థ సన్నద్ధమైంది. శుక్రవారం ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ సంబురాలు ఆనందోత్సాహాలతో జరుపుకునే విధంగా స్థానిక గోదావరి కళా ప్రాంగణం, జీఎం కాలనీ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


బతుకమ్మ ఆట పాటల కార్యక్రమాలకు ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో బతుకమ్మలతో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సద్దుల బతుకమ్మ సంబురాల ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిశీలించారు. స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్ లో ‘ఫ్యామిలీ డే – సద్దుల బతుకమ్మ సంబురాలు’ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు.


ఈ కార్యక్రమంలో పర్సనల్ ఏజియం లక్ష్మినారాయణ, అధికారులు అంజనేయులు, చంద్ర శేఖర్, చిలక శ్రీనివాస్, మదన్ మోహన్, నాగేశ్వర్ రావు,బండి సత్యనారాయణ, రాజం, దానలక్ష్ని బాయి, శివ నాయరణ,ప్రభాకర్, బాల సుబ్రమణ్యం కిరణ్ రాజ్ కుమార్,శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, నరేన్ చక్ర వర్తి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బంగారు సారంగపాణి పాల్లొన్నారు.