విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడవ జాబితాను 16 మందితో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికేసి వేణుగోపాల్ ప్రకటించారు. భోథ్ అభ్యర్థిగా అంతకుముందు ప్రకటించిన వెన్నెల అశోక్ స్థానంలో ఆడే గజేందర్ ను ప్రకటించారు. అలాగే వనపర్తి అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కూడా మార్చి తూడి మేఘారెడ్డికి కేటాయించారు.
చెన్నూరు (ఎస్సీ) జి. వివేక్, జుక్కల్( ఎస్సీ) తోట లక్ష్మీకాంతరావు, బాన్సువాడ ఏనుగు రవీందర్ రెడ్డి, కామారెడ్డి రేవంత్ రెడ్డి, నిజాంబాద్ అర్బన్ షబ్బీర్ అలీ, కరీంనగర్ పురుమళ్ళ శ్రీనివాస్, సిరిసిల్ల కొండం కరుణా మహేందర్ రెడ్డి, నారాయణఖేడ్ సురేష్ కుమార్ షెత్కార్, పటాన్ చెరు నీలం మధు ముదిరాజ్, డోర్నకల్( ఎస్టీ ) జాటోత్ రామచంద్రనాయక్ ,ఇల్లందు( ఎస్టీ) కోరం కనకయ్య, వైరా(ఎస్టీ) రామదాసు మాలోత్, సత్తుపల్లి(ఎస్సీ) మట్ట రామయ్య అశ్వారావుపేట( ఎస్టి) జారే ఆదినారాయణ లను అభ్యర్థులుగా ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి( ఎస్సీ) స్థానాలతో పాటు చార్మినార్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కొత్తగూడెం టికెట్ ను సిపిఐ కి కేటాయించారు. చేవెళ్లే అభ్యర్థి భీం భరత్ ని కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది.