మీడియా సమావేశంలో బాధితురాలు ఎస్.అంజనీదేవీ ఆవేదన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రంగల్ జిల్లా గీసుగొండ మండం ధర్మారం గ్రామానికి చెందిన పరకాల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ నుంచి తనకు తనకు ప్రాణభయం ఉన్నదని, తనను కాపాడి న్యాయం చేయాలని అంజనీ దేవి అనే మహిళ వేడుకుంది. హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో మంగళ వారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గిర్మాజీ పేటకు చెందిన ఎస్.అంజనీ దేవి తన గోడును వెల్ల బోసుకుంది. ఆమె మాటల్లోనే…
నాపై అత్యాచారం జరిగి రెండు సంవత్సరాలైంది. పోలీస్టేషన్‌లో కేసు నమోదై 19 నెలలు కావస్తున్నది. కానీ, గోపాల నవీన్ రాజు(49) ఇంతవరకు పెద్ద మనుషుల వద్దకు వచ్చి ఏవిధమైన సమాధానం ఇవ్వలేదు. చర్చలు జరపలేదు. ఫోన్ చేసిన వాళ్ళను నానా బూతులు తిట్టుచూ అనేక రకాలుగా బెదిరిస్తున్నాడు.
అయ్యా నేను ఒంటరి మహిళను. నాకు ఎవరూ లేరు. ప్రధానంగా నేను నా భర్త మీద పెట్టిన కేసుకు సంభందించి ఇతడు కోర్టులో చూసుకోవాలి. అంతే కాని నన్ను ఇతని అనుచరులతో వెంబడించి వేధిస్తూ నాకు నరకం చూపుతున్నారు. బాధ్యుడి మీద ఇప్పటివరకు చట్ట ప్రకారము ఎటువంటి కఠిన చర్యలను తీసుకోనందున గోపాల నవీన్ రాజు చీటికి మాటికి కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు.
నేను మా MLA నన్నపనేని నరేందర్ ను పలుమార్లు కలిసి నాకు న్యాయం చేయవలసిందిగా అడుగుగా, అతను కూడా పట్టించుకోవడంలేదు. గోపాల నవీన్ రాజు నన్ను వివాహము చేసుకొని తప్పించుకొని తిరుగుచున్నాడు. అధికారబలంతో, పార్టీ అండతో భయభ్రాంతులకు గురిచేస్తూ నన్ను కేసు వాపస్ తీసుకోవాలని మానసికంగా, శారీరకంగా బెదిరిస్తున్నాడు.
దిన దిన గండముగా నా జీవితం గడుస్తున్నది. కావున తమరు దయచేసి నా భర్త నుండి నాకు జీవన భృతికి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. నాభర్త నుంచి ఎటువంటి ప్రాణహాని గానీ, వేధింపులు గానీ, లేకుండా చేసి నన్ను కాపాడి నాకు న్యాయం చేయవలసిందిగా బాధితురాలు అంజనిదేవి కోరారు.