కాంగ్రెస్‌లో పాలాభిషేకాలకు బ్రేక్ : టీపీసీసీ ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఇకపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు, జేసీబీలతో భారీ గజమాలలు నిషేధం. ఆహార వృథా కాకుండా ఆహార పంపిణీ చేపట్టాలని టీపీసీసీ సర్క్యులర్ జారీ చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇకపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయొద్దని పీసీసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆహార పదార్థాల వృథా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొంటూ, వాటి బదులు ఆహార పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. పార్టీ నేతలకు భారీ గజమాలలు వేయడానికి జేసీబీలు, బుల్డోజర్లు వంటి భారీ యంత్రాలు వినియోగించడాన్ని కూడా నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు…టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు ఈ సర్క్యూలర్ విడుదల చేశారు.

Latest News