బీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా: తుల ఉమ

బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతానని తుల ఉమ అన్నారు

  • Publish Date - November 11, 2023 / 09:21 AM IST

విధాత : బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతానని తుల ఉమ అన్నారు. నామినేషన్ల చివరి రోజు వేముల వాడ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించి చివరి నిమిషంలో బీఫామ్ వికాస్‌రావుకు ఇవ్వడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనను బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీలో బీసీలను అణగొదొక్కాలని చూస్తున్నారని, అగ్రవర్గాలకు కొమ్ము కాస్తున్నరని తుల ఉమ అన్నారు. బీజెపీలో మహిళలకు స్థానం, గౌరవం లేదన్నారు. తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు.


బీఆర్ఎస్‌ నుంచి కూడా ఓ దొర అహంకారంతో బయటకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నానని తెలిపారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేనని పేర్కొన్నారు. చిన్ననాటి నేను దొరలకు వ్యతిరేకంగా కొట్లాడనన్నారు. బీజేపీకి సిద్ధాంతాలు లేవని, బీసీ సీఎం నినాదం ఓ బూటకమన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పే బీజేపీలో బండి సంజయ్ దొరల కాళ్ల వద్ద బీఫామ్ పెట్టారన్నారు. తాను ఏ పార్టీలో చేరలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తుల ఉమ పేర్కొన్నారు.