Uttam Kumar Reddy| ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని..తాము అన్ని రకాలుగా దీనిని అడ్డుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
విధాత : కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును(Almatti Dam height increase) తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని(Telangana government opposition)..తాము అన్ని రకాలుగా దీనిని అడ్డుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జవహర్ జాన్ పహడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యాం పై సుప్రీంకోర్టులో కేసుSupreme Court case నడుస్తుందని.. నేను రేపు స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం పెంపును వ్యతిరేకిస్తూ మా వాదనలు వినిపిస్తానని తెలిపారు. కృష్ణా, గోదావరి నది జలాలలో తెలంగాణకి రావాల్సిన వాటలను సాధించడంలో ఏ రాష్ట్రంతో నైనా పోరాడుతామని..కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనైనా పోరాడుతామన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ నది జలాల వాటాకు గండి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా, గోదావరి నది జలాలలో తెలంగాణకు రావాల్సిన వాటాలో అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని..వాళ్లు హయాంలోనే అది కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ కొనసాగుతుందని..రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందేనన్నారు. ఇప్పటికే కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలు అన్ని కూడా కాళేశ్వరంలో అక్రమాలను ప్రజల ముందుంచాయని గుర్తు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై దోషులుగా తేలిన ఎంతటి వారినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram