కొవాగ్జిన్ రెండో డోసు వారికే పంపిణీనెలాఖరు వరకు 2.50 లక్షల మందికి.. విధాత:హైదరాబాద్,రాష్ట్రంలో సోమవారం నుంచి టీకా పంపిణీని తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.అయితే, కేవలం రెండో డోసు వారికి.. అది కూడా కొవాగ్జిన్ తీసుకోవాల్సిన వారికే ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2.20 లక్షల కొవిషీల్డ్ డోసులు, 50 వేల కొవాగ్జిన్ డోసులున్నాయి.కొవాగ్జిన్ రెండో డోసును 28 రోజుల తర్వాత నుంచి తీసుకోవాల్సి ఉంది.ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో […]
కొవాగ్జిన్ రెండో డోసు వారికే పంపిణీ
నెలాఖరు వరకు 2.50 లక్షల మందికి..
విధాత:హైదరాబాద్,రాష్ట్రంలో సోమవారం నుంచి టీకా పంపిణీని తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.అయితే, కేవలం రెండో డోసు వారికి.. అది కూడా కొవాగ్జిన్ తీసుకోవాల్సిన వారికే ఇవ్వనున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2.20 లక్షల కొవిషీల్డ్ డోసులు, 50 వేల కొవాగ్జిన్ డోసులున్నాయి.కొవాగ్జిన్ రెండో డోసును 28 రోజుల తర్వాత నుంచి తీసుకోవాల్సి ఉంది.ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఈ టీకా రెండో డోసు పొందాల్సినవారు 2.50 లక్షలమంది ఉన్నారు.రెండు, మూడు రోజుల్లో లక్షన్నర నుంచి 2 లక్షల కొవాగ్జిన్ డోసులు వచ్చే అవకాశం ఉంది.