విధాత : పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ సీఎం కేసీఆర్‌ను ఆయన కాంగ్రెస్ నుంచి ఢీ కొడుతున్నారు. కాగా రేవంత్ రెడ్డికి నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ స్వగ్రామానికి చెందిన కోనాపూర్ గ్రామస్తులు డబ్బులు అందచేయడం విశేషంగా నిలిచింది.
రేవంత్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరామ్, మాణిక్‌రావు థాక్రే, షబ్బీర్ అలీ ప్రభృతులు నామినేషన్ అనంతరం స్థానికంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభకు హాజరయ్యారు.