విధాత : మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి. వివేక్ వెంకటస్వామి బుధవారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే హైద్రాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ చెన్నూరు టికెట్‌ను వివేక్ కుమారుడికి, పెద్దపల్లి ఎంపీ టికెట్ తనకు ఇస్తానన్న హామీ నేపధ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన అంతమొందించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి తాను కాంగ్రెస్ లో చేరడం జరిగిందన్నారు.