ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వరంగల్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కోర్టు హాజరు, జైలు శిక్షల వరకు చర్యలు తీసుకుంటామని సీఐ సుజాత హెచ్చరిక.

విధాత, వరంగల్ : ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు, అవసరమైతే కోర్ట్ లో హాజరు పరిచి జైలు శిక్ష కూడా విధించేలా చూస్తామని సీఐ సుజాత హెచ్చరించారు. ఆదివారం వరంగల్ లేబర్ కాలనీ, తెలంగాణ జంక్షన్‌లో సీఐ సుజాత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించని వారు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.