కృష్ణా, గోదావరి బోర్డుల పై కేంద్రం గెజిట్ అమ‌లుకు స‌హాకారం అందిస్తాం

విధాత: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షేకావత్‌తో భేటీ అయ్యారు. గెజిట్‌పై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పిటిషన్‌ విత్‌డ్రా దాఖలు చేసినట్లు చెప్పారు. గెజిట్‌ అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం […]

  • Publish Date - September 7, 2021 / 03:38 AM IST

విధాత: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షేకావత్‌తో భేటీ అయ్యారు. గెజిట్‌పై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పిటిషన్‌ విత్‌డ్రా దాఖలు చేసినట్లు చెప్పారు. గెజిట్‌ అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని.. గెజిట్‌ అమలు ఇంత త్వరగా సాధ్యమవుతుందా పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు.