విధాత: తన స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి టౌన్ ప్లానింగ్ విభాగం లోని సెక్షన్ ఆఫీసర్ శ్రీదేవి అండగా నిలుస్తూ తనకు అన్యాయం చేయడమే కాకుండా వేధింపులకు గురి చేస్తుందని తాళ్ల బస్తీకి చెందిన గీత గుప్తా ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని గత 8 నెలల నుంచి వేడుకుంటున్న కానీ శ్రీదేవి మాత్రం వారికే సపోర్ట్ చేస్తుందని గీత గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. అధికారి శ్రీదేవి తీరును నిరసిస్తూ శనివారం బాధిత మహిళ సర్కిల్ కార్యాలయం ముందు ఐ వాంట్ జస్టిస్ అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు.