యాదాద్రి: లక్ష్మీ పుష్కరిణికి జలాలు.. ట్రయల్ రన్ నిర్వహించిన వైటీడీఏ అధికారులు

విధాత,యాదాద్రి:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరించేందుకు కొండకింద గండిచెరువు పక్కనే నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో నీటిని విడుదల చేసి ట్రయల్ రన్ చేపట్టారు. 43మీటర్ల పొడవు, 16.50మీటర్ల వెడల్పు, 4ఫీట్ల ఎత్తులో నిర్మించిన గుండంలో మోటార్ల సాయంతో 2 ఫీట్ల మేర నీటి ని విడుదల చేసి పరీక్షించారు. ఎక్కడైనా నీటిని లీకేజీలు […]

  • Publish Date - September 8, 2021 / 06:36 AM IST

విధాత,యాదాద్రి:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరించేందుకు కొండకింద గండిచెరువు పక్కనే నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో నీటిని విడుదల చేసి ట్రయల్ రన్ చేపట్టారు.

43మీటర్ల పొడవు, 16.50మీటర్ల వెడల్పు, 4ఫీట్ల ఎత్తులో నిర్మించిన గుండంలో మోటార్ల సాయంతో 2 ఫీట్ల మేర నీటి ని విడుదల చేసి పరీక్షించారు. ఎక్కడైనా నీటిని లీకేజీలు గానీ, ఇతరాత్ర సమస్యలను పరిశీలించారు. గుండంలో మండ పాలు, చుట్టూ గల మెట్ల నుంచి నీటి విడుదల తీరు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇదిలాఉండగా యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్య లు చేపట్టారు. ఏక కాలంలో సుమారు 1500 మంది భక్తులు స్నానమాచరిచేందుకు వీలుగా రూ. 11.55 కోట్ల అంచనా వ్యయంతో 2.47ఎకరాలలో లక్ష్మీపుష్కరిణీ నిర్మించగా పనులు పూర్తి చేసుకుని తుదిమెరుగుల పనులు చివరి దశకు చేరుకున్నాయి.

Latest News