దాభాలో మామా అల్లుళ్ల‌ ఛాయ్ పే చర్చా

ప్రగతి భవన్ వీడిన సీఎం కేసీఆర్... ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు.

దాభాలో మామా అల్లుళ్ల‌ ఛాయ్ పే చర్చా

– పొన్నాల హోటల్ లో సరదాగా కాసేపు..

– హరీష్ తో రాజకీయాలపై సీఎం చర్చ


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ప్రగతి భవన్ వీడిన సీఎం కేసీఆర్… ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలతో బిజీగా ఉన్నారు. రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మంగళవారం సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సభ ముగించుకొన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పట్టణ శివారులోని పొన్నాల సోని దాబాలో టీ తాగి కాసేపు సరదాగా గడిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుతో రాజకీయాలతో పాటు పలు విషయాలపై కేసీఆర్ చర్చించారు. సాధారణ వ్యక్తిలా దాభాకు వ‌చ్చిన‌ సీఎం కేసీఆర్ ను చూసి స్థానికులు మామా అల్లుళ్ల‌ ఛాయ్ పే చర్చా అంటూ జోకులు పేల్చారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, సిద్దిపేట నాయకులు ఉన్నారు.