3కి.మీ. పరిగెత్తి.. రోగి ప్రాణం కాపాడిన డాక్టర్‌(Video)

డాక్టర్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు విధాత, హైదరాబాద్: అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ రోగికి ఆపరేషన్ చేసేందుకు ఓ డాక్టర్ ఏకంగా 3 కి.మీ. పరిగెత్తి ఆ రోగి ప్రాణం కాపాడాడు. డాక్టర్‌ను అభినందిస్తూ పలువురు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కు సంభవించిన వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా పనిచేసే డా.గోవింద్ నందకుమార్ ఆగస్టు 30 న ఓ […]

3కి.మీ. పరిగెత్తి.. రోగి ప్రాణం కాపాడిన డాక్టర్‌(Video)

డాక్టర్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు

విధాత, హైదరాబాద్: అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ రోగికి ఆపరేషన్ చేసేందుకు ఓ డాక్టర్ ఏకంగా 3 కి.మీ. పరిగెత్తి ఆ రోగి ప్రాణం కాపాడాడు. డాక్టర్‌ను అభినందిస్తూ పలువురు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కు సంభవించిన వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా పనిచేసే డా.గోవింద్ నందకుమార్ ఆగస్టు 30 న ఓ మహిళకు లాపరోస్కోపిక్ సర్జరీ చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. కానీ ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది.

కిలోమీటర్ల మేర జామైన ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ కాదని భావించిన డాక్టర్ కారు దిగి సుమారు 3 కి.మీ పరిగెత్తి ఆసుపత్రికి చేరుకుని ఆ మహిళకు సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో డాక్టర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. వృత్తి పట్ల నిబద్ధత చాటుకున్న ఆ బెంగళూరు వైద్యుడిని మనము అభినందిద్దాం.