కాలు జారి పట్టాలపై పడ్డాడు.. అంతలోనే ట్రైన్‌ వచ్చింది (వీడియో)

విధాత‌: ఓ ప్ర‌యాణికుడు రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నాడు. రైలు ఆగ‌గానే ఎక్కేందుకు య‌త్నిస్తుండ‌గా.. కాలు జారి కింద‌ప‌డిపోయాడు. అంత‌లోనే రైలు వేగంగా ముందుకు క‌ద‌లింది. అయితే ప్లాట్‌ఫాంపై ఉన్న ప్ర‌యాణికులంతా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. బాధిత ప్ర‌యాణికుడు చ‌నిపోయాడా..? బ‌తికాడా..? అని ఊపిరిబిగ‌ప‌ట్టి చూశారు. మొత్తానికి ఆ ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎటావా జిల్లాలోని భ‌ర్తానా రైల్వేస్టేష‌న్‌కు ఈ నెల 6వ తేదీన భోలా సింగ్‌(30) అనే ప్ర‌యాణికుడు వ‌చ్చాడు. […]

కాలు జారి పట్టాలపై పడ్డాడు.. అంతలోనే ట్రైన్‌ వచ్చింది (వీడియో)

విధాత‌: ఓ ప్ర‌యాణికుడు రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నాడు. రైలు ఆగ‌గానే ఎక్కేందుకు య‌త్నిస్తుండ‌గా.. కాలు జారి కింద‌ప‌డిపోయాడు. అంత‌లోనే రైలు వేగంగా ముందుకు క‌ద‌లింది. అయితే ప్లాట్‌ఫాంపై ఉన్న ప్ర‌యాణికులంతా ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

బాధిత ప్ర‌యాణికుడు చ‌నిపోయాడా..? బ‌తికాడా..? అని ఊపిరిబిగ‌ప‌ట్టి చూశారు. మొత్తానికి ఆ ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎటావా జిల్లాలోని భ‌ర్తానా రైల్వేస్టేష‌న్‌కు ఈ నెల 6వ తేదీన భోలా సింగ్‌(30) అనే ప్ర‌యాణికుడు వ‌చ్చాడు. ఆగ్రా సూప‌ర్‌ఫాస్ట్ ఇంట‌ర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోసం అత‌ను ఎదురుచూస్తున్నాడు. ఉద‌యం 9:45 గంట‌ల స‌మ‌యంలో రైలు రెండో నంబ‌ర్ ప్లాట్‌ఫాంపైకి వ‌చ్చేసింది.

ప్ర‌యాణికులంద‌రూ హ‌డావుడిగా ఎక్కుతున్న క్ర‌మంలో భోలాసింగ్ కాలు జారీ ప‌ట్టాల‌పై ప‌డిపోయాడు. రైలు వేగంగా ముందుకు క‌దిలింది. కానీ భోలా సింగ్ చాక‌చ‌క్యంతో ప్లాట్‌ఫాం, ప‌ట్టాల‌కు మ‌ధ్య క‌ప్ప‌లా అతుక్కుపోయాడు. రైలు స్టేష‌న్ దాట‌గానే భోలాసింగ్ పైకి లేకి అంద‌రికి చేతులు జోడించి దండం పెట్టాడు.