గులాబీ జెండా నీడలోనే ప్రజా సంక్షేమం: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత, నల్గొండ: గులాబీ జెండా నీడలోనే ప్రజా సంక్షేమం ఫరిడవిల్లుతుందని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిగూడ, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంకు హజరైన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వమే మనందరికి శ్రీరామ రక్షయని, కాంగ్రేస్ పాలనలో మునుగోడులో కరువు తాండవించిందన్నారు. ప్లోరైడ్ భూతం చుట్టుముట్టిందని, ముఖ్యమంత్రి కెసీఆర్ వచ్చిన తర్వాతే మునుగోడు దశ తిరగింది..ఫ్లోరైడ్ అంతం అయిందన్నారు. గులాబి జెండా నీడలోనే […]

విధాత, నల్గొండ: గులాబీ జెండా నీడలోనే ప్రజా సంక్షేమం ఫరిడవిల్లుతుందని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిగూడ, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంకు హజరైన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వమే మనందరికి శ్రీరామ రక్షయని, కాంగ్రేస్ పాలనలో మునుగోడులో కరువు తాండవించిందన్నారు. ప్లోరైడ్ భూతం చుట్టుముట్టిందని, ముఖ్యమంత్రి కెసీఆర్ వచ్చిన తర్వాతే మునుగోడు దశ తిరగింది..ఫ్లోరైడ్ అంతం అయిందన్నారు.

గులాబి జెండా నీడలోనే ప్రజలు సంతోషంగా జీవిస్తున్నరని, ఇతర రాష్ట్రాల ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నరన్నారు. ఇక్కడ అమలు అవుతున్న అభివ్రుద్ది సంక్షేమ పథకాల్ని తమకు కూడా కావాలని అడుగుతున్నరని, అందుకే కేంద్రం కేసీఆర్ ను చూసి ఓర్వడం లేదని, తెలంగాణాపై విషం చిమ్ముతున్నదని విమర్శించారు.
బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణాపై దాడి చేస్తున్నరని, కేసీఆర్ ని అపే శక్తి ఎవ్వరికి లేదని, గమ్యం చేరుకోవడంలో కేసీఆర్ ను మించిన యోధుడు ఎవ్వరు లేరని, కేసీఆర్ పట్టుబడితె విడిచిపెట్టరన్నారు. యావత్ దేశం కేసీఆర్ వైపు చూస్తున్నదని, తెలంగాణా సాధించిన విజయాల గురించే దేశ ప్రజలు మాట్లాడుతున్నరని, దేశ ప్రజలు అందుకే బీజేపీ నాయకులు కేసీఆర్ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నరన్నారు.
మునుగోడులో గులాబి పార్టీ కార్యకర్తలు సైనికుల లాగా పని చేయాలని. బిజేపి కుట్రల్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలన్నారు… మునుగోడులో గెలిచేది టిఆర్ యస్ అని, ప్రజలంతా ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నరని..అధికార టిఆర్ యస్ ను గెలిపిస్తేనే నియోజికవర్గం అభివ్రుద్ది బాట పడ్తుందని మునుగోడు ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.