Remote Job | కేవలం మూడేళ్ల అనుభవంతోనే రూ.9 కోట్ల రూపాయల జీతం అందుకున్నానని ఓ యువతి చేసిన పోస్టు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రిమోట్ ఉద్యోగాల ద్వారానే ఈ స్థాయి ఆదాయం సాధ్యమైందని ఆమె చెప్పడం పెద్ద చర్చకు దారి తీసింది
సతాక్షి అనే యూజర్ ఓ పోస్టు షేర్ చేస్తూ.. ” నాకు కేవలం మూడేళ్ల అనుభవం మాత్రమే ఉంది. కానీ నా జీతం భారత్‌లో గూగుల్ సీనియర్ మేనేజర్ స్థాయిలో ఉంది. ఇదే రిమోట్ ఉద్యోగాలకు ఉన్న బ్యూటీ ” అని పేర్కొంది. అయితే ఆమె పనిచేస్తున్న కంపెనీ వివరాలను వెల్లడించలేదు. కానీ తనకు వచ్చిన ఆఫర్ లెటర్ స్క్రీన్‌షాట్‌ను ఆమె పంచుకుంది. అందులో ఆమె దూరదృష్టి, అభివృద్ధి దృక్పథాన్ని మెచ్చుకుని ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లుగా ఉంది. అలాగే తక్షణ ప్రయోజనాల కంటే కూడా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఉండే తీవ్రమైన పోటీని గురించి సతాక్షి మరో పోస్టులో ప్రస్తావించింది. FAANG అని పిలిచే మెటా, అమెజాన్, ఆపిల్, నెట్‌ఫ్లిక్స్, ఆల్ఫాబెట్ సంస్థలపై మాత్రమే దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని సూచించింది. ఆయా కంపెనీల్లో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉందని, ఇతర అవకాశాలపై దృష్టి పెట్టాలని తెలిపింది.
అయితే సతాక్షి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. 90 వేలకు పైగా వ్యూస్ సాధించిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది రిమోట్ వర్క్ శక్తి అని కొందరు ప్రశంసిస్తుండగా.. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా? ఇలాంటి అవకాశాలు ఎలా పొందాలి? గైడెన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. కాగా, ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి క్లైయిమ్ నమ్మకూడదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
My compensation is equal to senior manager in Google(India), and I only have 3 years of experience. That’s the beauty of remote employment.
But people are busy in proving me fake, rather than finding a way to get remote opportunities pic.twitter.com/lQLLKsXT1s— Satakshi (@satakshi_ai) April 20, 2026
రిమోట్ ఉద్యోగాలు అంటే ఏంటి?
ఆఫీసుకు వెళ్లకుండా, ఇంటి నుంచి లేదా ఎక్కడి నుంచైనా పనిచేసే ఉద్యోగాలు. దీనికోసం ఒకే నగరంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. వేరే దేశం నుంచి కూడా పనిచేయవచ్చు. కంపెనీతో కమ్యూనికేషన్ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. క్లౌడ్ టూల్స్ ద్వారా పని పూర్తి చేస్తారు. ఒక టీమ్‌లో పనిచేసే సభ్యులు కూడా ఒక్కొక్కరూ ఒక్కో దేశంలో ఉన్నా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు.
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రిమోట్ ఉద్యోగాలకు ప్రాధాన్యం పెరిగింది. కంపెనీలు తమ లొకేషన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఇక జనాలు కూడా తమ సొంతూళ్లూనే ఉండి అంతర్జాతీయ స్థాయి జీతాలు పొందగలుగుతున్నారు. సతాక్షి చేసిన పోస్టుతో ఇప్పుడు రిమోట్ ఉద్యోగ అవకాశాలపై మరోసారి చర్చ ఊపందుకుంది.
Read More:
Snake Farming | పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
