మోదీ, రాహుల్ మధ్య బట్టల యుద్ధం.. బీజేపీకి కాంగ్రెస్ చురకలు
విధాత: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సరికొత్త యుద్ధం ప్రారంభమైంది. అదేదో ప్రజా సమస్యలపై కాదు.. ఆ ఇద్దరు నాయకులు ధరించే బట్టలపై. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధరించే టీ షర్ట్‌పై బీజేపీ ట్వీట్ చేసింది. వివరాళ్లోకి వెళితే.. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే, రాహుల్ ధరించిన ఓ […]

విధాత: కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సరికొత్త యుద్ధం ప్రారంభమైంది. అదేదో ప్రజా సమస్యలపై కాదు.. ఆ ఇద్దరు నాయకులు ధరించే బట్టలపై. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధరించే టీ షర్ట్‌పై బీజేపీ ట్వీట్ చేసింది. వివరాళ్లోకి వెళితే..
దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే, రాహుల్ ధరించిన ఓ టీషర్ట్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
యాత్రలో ఉన్న రాహుల్ నిన్న బర్బెరీ టీ షర్ట్ ధరించారు. ఈ టీ షర్ట్‌ను ధరించిన రాహుల్ ఫోటో, దాని ధరను తెలుపుతూ ఉన్న ఫొటోను బీజేపీ షేర్ చేస్తూ.. దీని ధర రూ. 41 వేలు.. ‘భారత్, దేఖో!’ అని పోస్ట్ చేసింది.
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోదీ ధరించిన సూట్ ధరను గుర్తుచేసింది. అరే.. భారత్ జోడో యాత్రకు తరలివచ్చిన అశేష జనవాహిణిని చూసి బీజేపీ నాయకులు భయపడి ఉన్నట్టు ఉన్నారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి.
బట్టల గురించే మాట్లాడాలనుకుంటే చర్చ ప్రధాని మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల విలువైన కండ్లద్దాల వరకు వెళ్తుంది’ అని కాంగ్రెస్ బీజేపీకి చురకలంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.