Crime news | మద్యం తాగొచ్చి గొడవపడ్డ భర్త.. మర్మాంగం కోసేసిన భార్య..!
Crime news | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోజూ తాగివచ్చి భర్త పెట్టే బాధలు భరించలేక అతని భార్య తిరగబడింది. కూరగాయలు కోసే కత్తితో దాడిచేసింది. ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. తీవ్రంగా గాయపడ్డ భర్తని స్థానికులు ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Crime news : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోజూ తాగివచ్చి భర్త పెట్టే బాధలు భరించలేక అతని భార్య తిరగబడింది. కూరగాయలు కోసే కత్తితో దాడిచేసింది. ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. తీవ్రంగా గాయపడ్డ భర్తని స్థానికులు ఒంగోలు నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ యాదవ్ గతకొద్ది కాలంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డైరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే డైరీ ఫామ్‌లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సీతా కుమారి అనే మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విజయ్ యాదవ్‌కు ఇదివరకే వివాహం కాగా అతడి భార్య బీహార్‌లోని సొంత ఊరిలోనే ఉంది. ఈ క్రమంలో సీతాకుమారితో వివాహేతర సంబంధం కొనసాగించి తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత సీత గర్భం దాల్చింది. గర్భవతిని అయిన తనను భర్త విజయ్ పట్టించుకోవడం లేదన్న కారణంగా సీత తరచూ అతనితో గొడవపడేది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన విజయ్ యాదవ్‌కు సీతాకుమారికి మద్య గొడవ జరిగింది. దీంతో సీతాకుమారి సహనం కోల్పోయి కత్తితో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో విజయ్ యాదవ్ మర్మాంగాన్ని కోసేసింది. కానీ దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్తని చూసి సీత భయంతో డైరీ ఫామ్ యాజమానికి ఫోన్ చేసింది.
యజమానికి జరిగిన విషయం పూర్తిగా చెప్పింది. అయితే డైరీ ఫామ్ యజమాని ఘటనా స్థలానికి వచ్చేలోపే అక్కడ నుంచి ఆమె పరారైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భార్య సీతా కుమారి కోసం గాలిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram