500 దిగువకు కరోనా మరణాలు

విధాత‌,దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా..స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 38,164 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాల సంఖ్య 500 దిగువకు చేరింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.2 శాతం తగ్గుదల కనిపించింది. 499 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు దేశంలో 3.11కోట్లమందికి పైగా వైరస్ బారినపడగా..4,14,108 మంది మహమ్మారికి బలయ్యారు. అలాగే నిన్న 14,63,593 మంది నమూనాలను సేకరించి పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 44.54 కోట్లకు పైగా […]

500 దిగువకు కరోనా మరణాలు

విధాత‌,దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా..స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 38,164 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాల సంఖ్య 500 దిగువకు చేరింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.2 శాతం తగ్గుదల కనిపించింది. 499 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు దేశంలో 3.11కోట్లమందికి పైగా వైరస్ బారినపడగా..4,14,108 మంది మహమ్మారికి బలయ్యారు. అలాగే నిన్న 14,63,593 మంది నమూనాలను సేకరించి పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 44.54 కోట్లకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది.

ప్రస్తుతం 4,21,665 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.35 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది. అలాగే నిన్న 38,660 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.03కోట్ల మార్కును దాటాయి. ఇక నిన్న 13.63లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 40.64కోట్లకు చేరింది.