పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్

విధాత:దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు కలవరపెడుతోంటే…. తాజాగా దీనికి ఎల్లో ఫంగస్ జత చేరింది. దేశంలోనే మొదటిసారిగా ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. దేశ రాజధాని (ఎన్‌సిఆర్) లో ఈ కేసు నమోదయ్యింది. అయితే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనా సెకండ్ వేవ్ తోనే అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు […]

పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్

విధాత:దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు కలవరపెడుతోంటే…. తాజాగా దీనికి ఎల్లో ఫంగస్ జత చేరింది. దేశంలోనే మొదటిసారిగా ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. దేశ రాజధాని (ఎన్‌సిఆర్) లో ఈ కేసు నమోదయ్యింది. అయితే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనా సెకండ్ వేవ్ తోనే అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. ఈ ఎల్లో ఫంగస్ లక్షణాలేంటంటే… బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడం. ఎల్లో ఫంగస్ తీవ్రరూపం దాలిస్తే చీము కారుతుంది. ఈ ఎల్లో ఫంగస్ ఆల్రెడీ ఉన్న గాయాల మీద ప్రభావం చూపిస్తుంది. చికిత్సను మందగింపజేస్తుంది. ఎల్లో ఫంగస్ వల్ల కళ్లు మూసుకుపోవడం, అవయవాలు పనిచేయకుండా పోవడం చివరికి నెక్రోసిస్‌కు దారితీస్తుంది. పసుపు ఫంగస్ ప్రాణాంతక వ్యాధి. ఇది ఇంటర్నల్ గా మొదలవుతుంది. లక్షణాలు కనిపించిన వెంటనే వీలైనంత తొందరగా చికిత్స మొదలుపెట్టాలి. ఎల్లో ఫంగస్ కు యాంటీ ఫంగల్ డ్రగ్ అయిన యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ తో చికిత్స అందించాలి. సరైన పరిశుభ్రత లేకపోవడమే ఎల్లో ఫంగస్ సంక్రమణకు కారణమవుతుంది. అంతేకాదు మిగిలిపోయిన ఆహారం, మలవిసర్జన ప్రాంతాలనుంచి ఈ ఫంగస్ వ్యాప్తి జరుగుతుంది. ఎక్కువ తేమగా ఉండడం కూడా ఎల్లో ఫంగస్ విస్తరణకు కారణమవుతుంది. తేమ 30% – 40% మధ్య ఉంటే ఈ ఫంగస్ ఎక్కువ ఉంటుంది.