వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు
విధాత: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇవాళ ఒక్కరోజే 1.08 కోట్లకు పైగా (1,08,84,899) టీకా డోసులు పంపిణీ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. టీకా పంపిణీ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 65 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 50,12,44,655 మంది ఉండగా, రెండు డోసు పూర్తి […]

విధాత: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇవాళ ఒక్కరోజే 1.08 కోట్లకు పైగా (1,08,84,899) టీకా డోసులు పంపిణీ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. టీకా పంపిణీ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 65 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 50,12,44,655 మంది ఉండగా, రెండు డోసు పూర్తి చేసుకున్నవారి సంఖ్య 14,90,84,406గా ఉంది. ఏపీలో ఇప్పటివరకు 3కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ పూర్తైంది. ఇందులో 84,22,543 మంది రెండు డోసులు తీసుకున్నారు.