రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ

విధాత:దేశంలో కొనసాగుతున్న మహమ్మారి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు రాష్ట్రాల అధికారులు, జిల్లా అధికారులతో మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్‌ విధానంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగనుంది. ఇందులో కర్ణాటక, బిహార్‌, అసోం, చండీగఢ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ అధికారులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. ఈ సందర్భంగా అధికారులు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, తమ అనుభవాలు మోదీకి వివరించనున్నారు. అలాగే పలు సిఫారసులు, సూచనలు […]

రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ

విధాత:దేశంలో కొనసాగుతున్న మహమ్మారి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు రాష్ట్రాల అధికారులు, జిల్లా అధికారులతో మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్‌ విధానంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగనుంది. ఇందులో కర్ణాటక, బిహార్‌, అసోం, చండీగఢ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ అధికారులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) తెలిపింది.

ఈ సందర్భంగా అధికారులు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, తమ అనుభవాలు మోదీకి వివరించనున్నారు. అలాగే పలు సిఫారసులు, సూచనలు సైతం చేయనున్నారు. మరోసారి ఈ నెల 20న కూడా కూడా మిగతా రాష్ట్రాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు.