దుమారం రేపుతున్న తమిళనాడు బీజేపీఅధ్యక్షుడి కామెంట్
విధాత: ‘‘మీడియాను నియంత్రిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా మన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోబోతున్నాం. కాబట్టి, ఎవరూ బాధపడకండి. మన పార్టీ మాజీ అధ్యక్షుడు.. సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. అన్ని మీడియా హౌజ్‌లు ఇక ఆయన కిందే ఉంటాయి’ అంటూ తమిళనాడు బిజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది.అన్నామలైని పార్టీ ఛీప్‌గా నియమించాక.. కొయంబత్తూరు నుంచి చెన్నైకి పార్టీ కేడర్‌తో చేరుకున్నాడు. కరోనా టైంలో ఈ టూర్ అధికారులకు పెద్ద తలనొప్పి […]

విధాత: ‘‘మీడియాను నియంత్రిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా మన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోబోతున్నాం. కాబట్టి, ఎవరూ బాధపడకండి. మన పార్టీ మాజీ అధ్యక్షుడు.. సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. అన్ని మీడియా హౌజ్‌లు ఇక ఆయన కిందే ఉంటాయి’ అంటూ తమిళనాడు బిజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది.
అన్నామలైని పార్టీ ఛీప్‌గా నియమించాక.. కొయంబత్తూరు నుంచి చెన్నైకి పార్టీ కేడర్‌తో చేరుకున్నాడు. కరోనా టైంలో ఈ టూర్ అధికారులకు పెద్ద తలనొప్పి అయ్యింది. దీంతో మీడియా హౌజ్‌లు ఈ యువ నేత పర్యటన మీద విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేశాయి. అయితే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని.. రాబోయే ఆరు నెలల్లో మీడియా మన చేతికి వస్తుందని ఆ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు అన్నామలై. తమిళనాడు బీజేపీ ఛీఫ్‌గా పని చేసిన ఎల్ మురుగన్.. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో సమాచార ప్రసార మంత్రిగా(మినిస్టర్ ఆఫ్ స్టేట్-డిప్యూటీ హోదా)గా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యాన్ని ఊటంకిస్తూ వ్యాఖ్యలు చేశాడు అన్నామలై.