ఫిర్యాదు స్వీకరించిన గంటలోపే యువకుడి ఆత్మహత్యాయత్నం
కౌన్సెలింగ్ నిర్వహించి యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించిన ఉరవకొండ సి.ఐ ఉరవకొండ సర్కిల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ విధాత:ఫిర్యాదు స్వీకరించిన గంటలోపే యువకుడి ఆత్మహత్యాయత్నాన్ని ఉరవకొండ సర్కిల్ పోలీసులు నిలువరించారు. వివరాలు… విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుండీ బయటికెళ్లాడు. తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యుల ఫోన్ కు మెసేజ్ పంపి తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆందోళన చెందిన ఆ యువకుడి తండ్రి వేణుగోపాల్ […]

కౌన్సెలింగ్ నిర్వహించి యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించిన ఉరవకొండ సి.ఐ
ఉరవకొండ సర్కిల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ
విధాత:ఫిర్యాదు స్వీకరించిన గంటలోపే యువకుడి ఆత్మహత్యాయత్నాన్ని ఉరవకొండ సర్కిల్ పోలీసులు నిలువరించారు. వివరాలు… విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుండీ బయటికెళ్లాడు. తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యుల ఫోన్ కు మెసేజ్ పంపి తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
ఆందోళన చెందిన ఆ యువకుడి తండ్రి వేణుగోపాల్ పాల్తూరు ఎస్సై రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. ఉరవకొండ సి.ఐ శేఖర్ దృష్టికి వెళ్లడంతో పాల్తూరు, ఉరవకొండ, వజ్రకరూరు ఎస్సైలు రాజేశ్వరి , రమేష్ రెడ్డి, వెంకటస్వామిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా… గుంతకల్లు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈక్రమంలో వజ్రకరూరు మండలం చిన్నహోతూరు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద ఆ యువకుడు ఉన్నట్లు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పసిగట్టారు. అప్పటికే ఆత్మహత్యాయత్నానికి ఆ యువకుడు సిద్ధంగా ఉన్నాడు. అంతలోనే ఎస్సైల బృందం అక్కడికెళ్లి పృథ్వీరాజ్ ను పట్టుకున్నారు. ఉరవకొండ సి.ఐ శేఖర్ కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన గంటలోపే యువకుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన సి.ఐ శేఖర్ మరియు ఎస్సైల బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు అభినందించారు.