కోవాగ్జిన్ రెండో డోస్ కు టీటీడీ ఉద్యోగులకు టోకెన్లు

కోవాగ్జిన్ రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన టీటీడీ ఉద్యోగుల జాబితాను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. వీరికి మంగళ, బుధవారాల్లో వ్యాక్సిన్ వేస్తారు.ఉద్యోగులు మొదటి డోస్ వేసుకున్న రోజును పరిగణనలోకి తీసుకుని అధికారులు ఈ జాబితా సిద్ధం చేశారు. తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న టీటీడీ ఉద్యోగులకు మున్సిపల్ సిబ్బంది నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన వారు కంచి మఠం సమీపంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలోని 40వ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు చూపించి […]

కోవాగ్జిన్ రెండో డోస్ కు టీటీడీ ఉద్యోగులకు టోకెన్లు

కోవాగ్జిన్ రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన టీటీడీ ఉద్యోగుల జాబితాను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. వీరికి మంగళ, బుధవారాల్లో వ్యాక్సిన్ వేస్తారు.ఉద్యోగులు మొదటి డోస్ వేసుకున్న రోజును పరిగణనలోకి తీసుకుని అధికారులు ఈ జాబితా సిద్ధం చేశారు. తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న టీటీడీ ఉద్యోగులకు మున్సిపల్ సిబ్బంది నుంచి ఫోన్ వస్తుంది.

ఫోన్ వచ్చిన వారు కంచి మఠం సమీపంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలోని 40వ వార్డు సచివాలయంలో ఆధార్ కార్డు చూపించి టోకెన్ పొందాలి. టోకెన్ లేని వారికి వ్యాక్సిన్ వేయరు. మొదటి డోస్ వేసుకున్న రోజు నుంచి రెండో డోస్ గడువును ప్రాధాన్యత క్రమంలో లెక్కించి మున్సిపల్ అధికారులు ఈ టోకెన్లు మంజూరు చేస్తున్నారు. ఉద్యోగులు ఈ విషయం గుర్తించి రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోగలరు.