India’s Literacy Rate Gender Gap | అక్షరాస్యతలో మహిళలు, పురుషుల మధ్య 16 శాతం గ్యాప్!

మహిళల్లో అక్షరాస్యత క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. పురుషులతో సమానంగా చేరుకోలేక పోతున్నారు. దీనికి అనేక సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం పురుషులు, మహిళల మధ్య సుమారు 16 శాతం తేడా కనిపిస్తున్నది. రానున్న 2026 జనాభా లెక్కల్లో మహిళల అక్షరాస్యత శాతం పెరుగుతుందనే ఆశాభావాలు ఉన్నాయి.

India’s Literacy Rate Gender Gap | అక్షరాస్యతలో మహిళలు, పురుషుల మధ్య 16 శాతం గ్యాప్!

India’s Literacy Rate Gender Gap | దేశంలో అక్షరాస్యత రేటు పెరిగింది. అయితే పురుషులు, మహిళల మధ్య అక్షరాస్యతలో మాత్రం 16.68 శాతం తేడా ఉందని 2011 జనాభా లెక్కలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏటా మహిళల అక్షరాస్యత రేటు పెరుగుతోంది. కానీ, పురుషులతో సమానంగా ఆ పెరుగుదల ఉండటం లేదు. మరి ఈ సారి జనాభా లెక్కల్లో ఎలాంటి వివరాలు వెల్లడవుతాయో!

ఒక దేశంలో చదవడం, రాయడం తెలిసిన వ్యక్తుల శాతాన్ని అక్షరాస్యత రేటు అంటారు. దీని ద్వారా ఒక ప్రాంతంలో ఎంతమంది విద్యావంతులున్నారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అంటే ఒక నిర్దిష్ట జనాభాలో ఒక్క భాషలోనైనా అర్థం చేసుకుని చదివి, రాసే వ్యక్తుల జనాభాను లేదా శాతాన్ని సూచించేదే అక్షరాస్యత రేటు. దీని ద్వారా ఆయా ప్రాంతం లేదా ఆ దేశంలో ఉన్న జనాభా విద్యాస్థాయి తెలిసే అవకాశం ఉంది. 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు లేదా ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల విద్యార్హతలను అక్షరాస్యత రేటు ద్వారా తెలుసుకోవచ్చు. లిటరసీ రేటు సామాజిక అభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పనిచేస్తుంది. మొత్తం అక్షరాస్యుల సంఖ్యను మొత్తం జనాభాతో భాగించి వందతో గుణిస్తే వచ్చేదే అక్షరాస్యత రేటు.

పురుషులు, మహిళల అక్షరాస్యత మధ్య గ్యాప్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో ఇండియాలో అక్షరాస్యత 12% మాత్రమే. 1951 జనాభా లెక్కల ప్రకారంగా దేశంలో మొత్తం అక్షరాస్యత శాతం 18.33కి చేరుకుంది. అయితే ఇందులో మహిళల లిటరసీ రేటు 8.86 శాతం. పురుషుల లిటరసీ రేటు 27.16 శాతం. పురుషులు, మహిళల మధ్య అక్షరాస్యత శాతంలో 18.30 శాతం తేడా ఉంది. 1961 నాటికి దేశంలో అక్షరాస్యత 28.30 శాతానికి చేరింది. ఇందులో పురుషుల వాటా 40.40%గా ఉంది. మహిళలు 15.15 శాతానికి చేరారు. 1971నాటికి పురుషుల కంటే సగటున మహిళల అక్షరాస్యత శాతం పెరిగింది. అప్పట్లో మొత్తం 34.45 శాతం లిటరసీ రేటు నమోదైంది. ఇందులో పురుషులు 45.95 శాతంగా ఉంటే, 21.97 శాతం మంది మహిళలు అక్షరాస్యులయ్యారు.1981లో మొత్తం 43.57 మంది అక్షరాస్యులయ్యారు. ఈ సమయంలో పురుషుల అక్షరాస్యత శాతం బాగా పెరిగింది. 56.38 శాతం మంది పురుషులు చదువుకున్నారు. ఇక మహిళల్లో 29.76 మంది మాత్రమే చదువుకున్నారు. 1991 నాటికి దేశంలో 52.21 మంది అక్షరాస్యులైతే పురుషుల్లో 64. 13 శాతం మంది పురుషులున్నారు. ఇక మహిళల్లో 39.29 శాతం మంది ఉన్నారు. 2001లో దేశంలో అక్షరాస్యత 65.38 శాతానికి చేరింది. అయితే ఇందులో మహిళలు 54.16కు చేరింది. పురుషుల అక్షరాస్యత శాతం 75.85 కి చేరింది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం 74.04 శాతం అక్షరాస్యత రేటు నమోదైంది. ఇందులో పురుషుల లిటరసీ రేటు 82.14 శాతం, మహిళల అక్షరాస్యత శాతం 65.46 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

అక్షరాస్యతలో మిజోరాం టాప్

2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగలేదు. వాస్తవానికి 201లో జనాభా లెక్కలు తీయాలి. అయితే అప్పట్లో కరోనా కారణంగా జనాభా లెక్కలు తీయలేదు. 2026 అక్టోబర్ నుంచి రెండు విడతల్లో జనాభా లెక్కలను తీస్తారు. అంటే ఈ జనాభా లెక్కలను 2027లో విడుదల చేస్తారు. అయితే స్టాటిస్టా ప్రకారం 2022లో దేశ అక్షరాస్యత దాదాపు 76.32 శాతంగా ఉంది. రాష్ట్రాల మధ్య అక్షరాస్యత రేటులో గణనీయమైన తేడాలున్నందున డేటా ఇంకా పూర్తి కాలేదు. అయితే దీనికి విరుద్దంగా పీఎల్ఎఫ్ఎస్ 2023-24 ఎంఎస్‌పీఐ సర్వే (మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్) ప్రకారం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదైంది. 2023–24 సంవత్సరం నాటికి దేశంలో మొత్తం అక్షరాస్యత 80.9 శాతానికి చేరింది. ఈ సర్వే ప్రకారం మిజోరం రాష్ట్రం అక్షరాస్యతో 98.2 శాతంతో టాప్ లో నిలిచింది. 97.3 శాతంతో ఆ తర్వాతి స్థానంలో లక్షద్వీప్ నిలిచింది. నాగాలాండ్ 95.7 శాతంతో నాగాలాండ్ ఉంది. గతంలో టాప్ లో ఉన్న కేరళ రాష్ట్రం 95.3 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. 94.2 శాతంతో ఐదో స్థానంలో మేఘాలయ నిలిచింది. 93.7 శాతంతో త్రిపుర, చండీగఢ్ రాష్ట్రాలు ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఎనిమిదో స్థానంలో 93.6 శాతంతో గోవా ఉంది. 92.7 శాతంతో పాండిచ్చేరి తొమ్మిది, 92 శాతంతో మణిపూర్ పదో స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం 72.6 శాతంతో అక్షరాస్యత రేటులో ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. బీహార్ లో 74.3 శాతం అక్షరాస్యత రేటు నమోదైంది. మధ్యప్రదేశ్ లో 75.2 శాతం, రాజస్థాన్ లో 75.8 శాతం, జార్ఖండ్ లో76.7 శాతం,తెలంగాణలో 76.9 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో78.2 శాతం, చత్తీస్ గఢ్ లో 78. 5 శాతం, లడక్ లో81 శాతం, జమ్మూ కశ్మీర్ లో 82 శాతం అక్షరాస్యత రేటు నమోదైంది.

2027 జనాభా లెక్కల్లో మహిళల అక్షరాస్యత పెరిగేనా?

ఇప్పటి వరకు ఉన్న జనాభా లెక్కల ప్రకారంగా మహిళల అక్షరాస్యత శాతం పురుషులతో పోలిస్తే తక్కువగానే ఉంది. అయితే చదువుకు ప్రాముఖ్యత పెరిగింది. పురుషులతో సమానంగా మహిళలు చదువుకుంటున్నారు. ఉత్తీర్ణతా శాతాల్లో తరచూ బాలికలే టాప్‌గా నిలుస్తున్నారు. అయితే ఇది ఏ మేరకు పెరిగిందనేది 2027 జనాభా లెక్కల్లో తేలనుంది. పీఎల్ఎఫ్ఎస్ 2023-24 ఎంఎస్‌పీఐ సర్వే ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 80.9 శాతం. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో 92.9 శాతం మంది అక్షరాస్యులైతే, 84.9 శాతం మంది మహిళలు అక్షరాస్యులున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 84.7 శాతం పురుషులు అక్షరాస్యులుంటే 70. 4 శాతం మంది మాత్రమే మహిళలు అక్షరాస్యులుగా నమోదయ్యారు. సామాజిక కట్టుబాట్లు,పేదరికం, బాల్య వివాహాలు, లింగ వివక్ష వంటి అంశాలు మహిళల అక్షరాస్యతపై ప్రభావం చూపాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ మార్పులు పురుషులతో సమానంగా మహిళలు అక్షరాస్యతను ఇంకా సాధించలేదు. మహిళల్లో అక్షరాస్యత రేటును పెంచేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవి కొన్ని ఫలితాలను ఇస్తున్నాయి. దీని కారణంగానే మహిళల అక్షరాస్యత పెరిగేందుకు కారణం అవుతున్నాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతానికి భిన్నంగా అమ్మాయిలను కూడా అబ్బాయిలతో సమానంగా చదివేందుకు పేరేంట్స్ ముందుకు వస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మహిళల అక్షరాస్యతను పెరగడానికి కారణంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Police complaint on mother | అమ్మ, అక్కపై పోలీసులకు ఓ బుడ్డోడి ఫిర్యాదు! : తక్షణమే స్పందించిన పోలీసులు
Aditya Vantage Hydra | ఆదిత్య వాంటేజ్‌ నిర్మాణంపై నిగ్గు తేల్చేందుకు రంగంలోకి హైడ్రా!
Tesla Robot Optimus | కుంగ్‌ ఫూ యుద్ధ కళ ప్రదర్శిస్తున్న రోబో ఆప్టిమస్‌! వీడియో అదుర్స్‌!
Leopard Jumps From Tree To Tree | చెట్లపై చిరుత జంపింగ్ లు..వావ్ అనాల్సిందే!