ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు

అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఒక బోర్డు ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా నియమించిన వ్యక్తికి, అక్కడ కాకుండా సచివాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా సెక్రెటేరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ (ఎస్.బీ.ఎం) బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించడం ఉద్యోగులకు ఆగ్రహానికి తెప్పిస్తున్నది.

contract employee controversy

విధాత, హైదరాబాద్:

సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఫైళ్లను సచివాలయంలో ప్రభుత్వ అధికారి పరిశీలించి, ప్రధాన కార్యదర్శి పేషీకి పంపిస్తారు. కానీ.. గత ఏడాదిన్నర కాలంగా కాంట్రాక్టు ఉద్యోగి పరిశీలించిన తరువాతనే ప్రధాన కార్యదర్శి వద్దకు పైళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమ ఫైళ్లను ఆయన ద్వారా ఎందుకు పంపిస్తున్నారంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లోలోపల రగిలిపోతుండగా, మరికొందరు నసుగుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు.

అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఒక బోర్డు ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా నియమించిన వ్యక్తికి, అక్కడ కాకుండా సచివాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా సెక్రెటేరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ (ఎస్.బీ.ఎం) బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించడం ఉద్యోగులకు ఆగ్రహానికి తెప్పిస్తున్నది. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి వద్దే తేల్చుకుంటామని తెలంగాణ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.

రాష్ట్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో సనత్ నగర్‌లో ఒక బోర్డు కార్యాలయం కొనసాగుతున్నది. ఈ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా ఉంటారు. గతంలో పనిచేసిన ఒక చైర్‌పర్సన్‌ తనకు దగ్గరగా ఉన్న ఒక రిటైర్డు అధికారికి పునరావాసం కల్పించారు. ఏడాది కాలం పాటు పనిచేసేందుకు వీలుగా బోర్డులో కాంట్రాక్టు ఉద్యోగిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ఆయన బోర్డు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించాలి. కానీ ఆయన ను సచివాలయంలోకి తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. తొలుత ఆయన సెక్రెటేరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ (ఎస్.బీ.ఎం) బాధ్యతలు అప్పగించారు. సచివాలయంలో మంత్రుల చాంబర్లు మొదలు అధికారులకు సీట్లు కేటాయించడం, బిల్డింగ్‌లో మరమ్మత్తులు, శానిటేషన్, సమావేశాలు జరిగిన సమయంలో హాళ్ల కేటాయింపు, తినుబండారాలు సమకూర్చడం వంటి విధులు ఉంటాయి.

సెక్రెటేరియట్ బిల్డింగ్ నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.1 కోటి కి పైగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇలాంటి కీలక బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు చెందిన ఇంజినీర్లకు అప్పగించాల్సి ఉండగా, కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించడం ఏమిటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లను పరిశీలించి, ప్రధాన కార్యదర్శికి పంపించే ముఖ్య బాధ్యతను అప్పగించడం మరో వివాదానికి కారణమైంది. సెలవులు, అనుమతులు, పదోన్నతులు, వ్యక్తిగత సమస్యల కోసం ఇచ్చే వినతులకు సంబంధించిన ఫైళ్లను ఈయన ద్వారా ప్రధాన కార్యదర్శికి వెళ్లేలా మౌఖిక ఆదేశాలు ఉన్నాయని సచివాయ ఉద్యోగులు అంటున్నారు. ఇది సరైన విధానం కాదని, పర్మినెంట్ అధికారికి అప్పగించాలని ఇద్దరు ముగ్గురు ఐఏఎస్‌లు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయిందనే వాదన వినిపిస్తున్నది. ఈ రెండు అంశాలపై ప్రధాన కార్యదర్శితో పాటు, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ఉన్నతాధికారులతో తేల్చుకుంటామని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె…డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం

Latest News