Turmeric Farming | సిరులు పండిస్తున్న ‘ప‌సుపు’.. ఎక‌రానికి రూ. 8 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఆలుమ‌గ‌లు

Turmeric Farming | జీవితంలో ఆర్థికంగా నిల‌దొక్కుకోవాలంటే ఉద్యోగమే చేయాల్సిన ప‌ని లేదు. వివిధ మార్గాల్లో డ‌బ్బు( Money ) సంపాదించొచ్చు. కాస్త ఓపిక ఉండి.. క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొని నిల‌బ‌డితే.. వ్య‌వ‌సాయం( Agriculture )లో లాభాలు గ‌డించొచ్చు. ఏడాదికి ల‌క్ష‌లు, కోట్ల రూపాయాలు సంపాదించొచ్చు. అందుకు నిద‌ర్శ‌నం ఈ ఆలుమ‌గ‌లే( Couples ). ఎక‌రా పొలంలో ప‌సుపు సాగు( Turmeric Farming ) చేసి.. ఏడాదికి ల‌క్ష‌ల రూపాయాలు సంపాదిస్తున్నారు. 

  • By: raj    weeds    Jul 08, 2025 8:08 AM IST
Turmeric Farming | సిరులు పండిస్తున్న ‘ప‌సుపు’.. ఎక‌రానికి రూ. 8 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఆలుమ‌గ‌లు

Turmeric Farming | వ్య‌వ‌సాయం( Agriculture ) చేయాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అంద‌రూ అగ్రిక‌ల్చ‌ర్ చేయ‌లేరు. అది కొంద‌రికే సాధ్య‌మ‌వుతుంది. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముంద‌డుగు వేస్తే అనుకున్న దాని కంటే ఎక్కువ‌గా దిగుబ‌డి సాధించొచ్చు. ఓ ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు( Couples ) కూడా తాము పండించే పంట‌ల‌కు భిన్నంగా ప‌సుపు పంట సాగు( Turmeric Farming ) చేశారు. మొద‌ట్లో కొంచెం న‌ష్టాలు చ‌విచూసిన‌ప్ప‌టికీ.. విశ్ర‌మించ‌లేదు. మ‌ళ్లీ మ‌రుస‌టి ఏడాది అదే ప‌సుపు సాగు( Turmeric Farming ) చేశారు. అలా ఏడాదికి ఏడాదికి ప‌సుపు సాగు చేస్తూ 25 కేజీల నుంచి 2500 కేజీలు పండించే స్థాయికి ఎదిగారు. ఎక‌రానికి ఏడాదికి రూ. 8 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు ఆ ఇద్ద‌రు ఆలుమ‌గ‌లు. మ‌రి వీరి స‌క్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే మ‌హారాష్ట్ర‌( Maharashtra )లోని అహ్మ‌ద్ న‌గ‌ర్ వెళ్లాల్సిందే.. అదే ప్ర‌స్తుతం అహిల్యాన‌గ‌ర్‌( Ahilyanagar )గా పిలుచుకుంటున్న ప్రాంతం అది.

అహిల్యాన‌గ‌ర్‌లోని లోని గ్రామానికి( Loni Village ) చెందిన అనిత‌( Anita ), సంజ‌య్ గోగారే( Sanjay Ghogare ) దంప‌తులు.. త‌మ‌కున్న పొలంలో అల్లం( Ginger ), చెరుకు( Sugarcane ), ప‌శువుల గ‌డ్డితో పాటు కూర‌గాయ‌లు( Vegetables ) పండిస్తున్నారు. కానీ ఈ సాగులో ఆదాయం అంతంత మాత్రంగా ఉంది. దిగుబ‌డి త‌క్కువ‌గా ఉంది. దీంతో కొత్త‌గా ఏదైనా సాగు చేయాల‌నే ఆలోచ‌న ఆ దంప‌తుల‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో 2008లో అనిత మామ‌.. స‌మీప గ్రామం నుంచి పసుపు భూగ‌ర్భ కాండాల‌ను( turmeric rhizomes ) తీసుకొచ్చాడు. సేలం వెరైటీకి( Salem Variety ) చెందిన ఆ పసుపు వేర్ల‌ను త‌మ పొలంలో నాటారు. ప‌ది నెల‌ల త‌ర్వాత పసుపు పంట చేతికి వ‌చ్చింది. ఒక‌ట్రెండు కిలోలు మాత్రమే దిగుబ‌డి వ‌చ్చింది.

మ‌రుస‌టి ఏడాది ఐదు కిలోల దిగుబ‌డి

త‌క్కువ దిగుబ‌డి వ‌చ్చిన‌ప్ప‌టికీ కుంగిపోలేదు. మ‌ళ్లీ అదే ప‌సుపు సాగు( Turmeric Farming ) చేశారు. ఈ సారి 5 కిలోల దిగుబ‌డి వ‌చ్చింది. ఆ పసుపును ప్రాసెస్ చేసి.. బంధువుల‌కు, స్నేహితుల‌కు అంద‌జేశారు. పసుపు నాణ్య‌త‌తో కూడి ఉంద‌ని స్నేహితుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. యాంటి ఇన్‌ఫ్ల‌మేట‌రీ( anti-inflammatory ), యాంటీ ఆక్సిడెంట్‌ ( antioxidant )గా ప‌ని చేసే ఈ ప‌సుపు ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని, త‌ప్ప‌కుండా ప‌సుపు సాగు చేయాల‌ని బంధువులు, స్నేహితుల నుంచి అనిత దంపతుల‌కు ప్రోత్సాహం ల‌భించింది.

స‌వాళ్ల‌ను అధిగ‌మించి.. 25 కిలోల‌కు పైగా దిగుబ‌డి

మూడో ఏడాది కూడా మొక్క‌వోని దీక్ష‌తో మ‌ళ్లీ ప‌సుపు పండించారు. ఆ ఏడాది ప‌సుపు సిరులు కురిపించింది. మూడో ఏడాది 25 కేజీల నుంచి 30 కేజీల దాకా దిగుబ‌డి వ‌చ్చింది. అయితే ఈ పసుపు మార్కెట్‌లో కొనే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే ప‌సుపును యంత్రంతో కాకుండా చేతితో పాలిష్ చేశామని, దానికి మెరుపు లేదని స్థానిక దుకాణదారులు త‌మ పసుపును కొనేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని సంజ‌య్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇంటి వ‌ద్దే ఓ బోర్డు ఏర్పాటు చేసి.. ఆర్గానిక్ ట‌ర్మ‌రిక్ పౌడర్( Organic Turmeric Powder ) త‌మ వ‌ద్ద ల‌భ్యం అవుతుంద‌ని తెలియ‌జేశారు. ఇంకేముంది.. జ‌నాలు ఎగ‌బ‌డి కొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు ఈ దంప‌తులు ఏ మార్కెట్‌కు వెళ్లి ప‌సుపును విక్ర‌యించ‌లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇంటి నుంచే ప‌సుపును విక్ర‌యిస్తున్నారు.

కేజీ పసుపు రూ. 2 వేలు..

ఏడాదికి ఏడాదికి పసుపు దిగుబ‌డి పెర‌గ‌డంతో.. విక్ర‌యాలు కూడా బాగానే కొన‌సాగుతున్నాయి. ఒక ఎక‌రం పొలంలో ప‌సుపు పండిస్తూ లాభాలు గ‌డిస్తున్నారు. పండించిన పసుపును పౌడ‌ర్‌గా, హ‌ల్దీ దూద్ పౌడ‌ర్‌( haldi-doodh powder )గా ప్రాసెస్ చేసి ఒక కేజీని రూ. 2 వేల‌కు విక్ర‌యిస్తున్నారు. ఏడాదిలో ఎక‌రా పొలంలో 2500 కిలోల పసుపు పండిస్తున్నారు. దీంతో ఏడాదికి ఎక‌రానికి రూ. 8 ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తుంది. దీంట్లో రూ. 2 ల‌క్ష‌లు పెట్టుబ‌డికి పోగా, రూ. 6 ల‌క్ష‌లు లాభం ఉంద‌ని అనిత దంప‌తులు తెలిపారు. ఇక మ‌రో నాలుగు ఎక‌రాల్లో అల్లం, చెరుకుతో పాటు ఇత‌ర పంట‌ల‌ను సాగు చేస్తున్నారు.

2019లో అనిత దంప‌తుల‌కు అవార్డు

అనిత త‌న కెరీర్‌ను మ‌రింత బిల్డ‌ప్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో 2013లో స్వ‌యం స‌హాయ‌క సంఘాల గ్రూపు( SHG )లో చేరారు. అప్పుడు ప‌సుపును సాగు చేయాల‌ని, దీని వ‌ల్ల లాభాలు ఉన్నాయ‌ని తోటి స‌భ్యులు అనిత‌ను ప్రోత్స‌హించారు. దీంతో పండించిన ప‌సుపును ముంబై( Mumbai ), పుణె( Pune )తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వ‌యం స‌హాయ‌క గ్రూపుల ఎగ్జిబిష‌న్ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాన‌ని, దాంతో త‌మ పసుపుకు డిమాండ్ పెరిగింద‌న్నారు. 2014 నుంచి సాయి సాగ‌ర్ బ్రాండ్( Sai Sagar Brand ) పేరుతో పసుపు అమ్మ‌కాలు మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపారు. 2019లో ఈ జంట‌కు మ‌హారాష్ట్ర హిర్కాణి అవార్డు(Maharashtra Hirkani Award ) కూడా వ‌రించింది.

ప‌సుపు సాగుకు సేంద్రీయ ఎరువులు

ప్ర‌తి ఏడాది జూన్ మాసంలో పసుపు వేర్ల‌ను నాటుతారు. ఈ పంట సాగుకు కేవ‌లం సేంద్రీయ ఎరువుల‌నే వాడుతున్నారు. వీరికి 12 ఆవులు ఉన్నాయి. వాటి పేడ‌( Cow Dung )ను ఎరువుగా వినియోగిస్తున్నారు. ట్రైకోడెర్మా( Trichoderma ), బాసిల్ల‌స్ ( Bacillus ) వంటి ఆర్గానిక్ ఫ‌ర్టిలైజ‌ర్స్‌( Organic Fertilizers )ను కూడా వినియోగిస్తున్నారు. ఇవి మొక్క అభివృద్ధికి ఎంతో దోహ‌దం చేస్తాయి. మార్చి, ఏప్రిల్ నాటికి పంట చేతికి వ‌స్తుంది. ఆ త‌ర్వాత తామే ప‌సుపును ప్రాసెస్ చేస్తాం. వేర్ల‌తో ప‌సుపును వేరు చేసిన త‌ర్వాత వేడి నీళ్ల‌ల్లో బాగా ఉడ‌క‌బెడుతాం. 15 రోజుల పాటు దాన్ని ఎండ‌బెట్టి ప్రాసెస్‌కు రెడీ చేస్తాం. ఆర్డ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ప్రాసెస్ చేసి విక్ర‌యిస్తామ‌ని అనిత పేర్కొన్నారు.