Dhoni: ధోని అభిమానులు చేసిన సౌండ్స్ వినలేక చెవులు మూసుకున్న స్టార్ హిట్టర్

Dhoni:మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అభిమానులు కాదు వీరాభిమానులు ఉన్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన అశేషమైన క్రేజ్ దక్కించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ… తన ఆటతో, నాయకత్వ లక్షణాలతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ధోనీ సారథ్యంలోనే భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ రావడంతో మహేంద్రుడి క్రేజ్ మరింత పెరిగింది. కొన్నేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అప్పుడు బ్యాటింగ్‌కి వస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున చాన్నాళ్ల నుండి ఆడుతున్న ధోనికి ఈ ఏడాది చివరి ఐపీఎల్ కానుంది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టు తరఫున ఆడుతున్న ధోని.. కోట్లాది మంది సీఎస్కే ఫ్యాన్స్‌కు ఆరాధ్య దైవంగా మారాడు. చెన్నైలో ధోని మ్యాచ్ ఆడితే స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఆయన కోసం ప్రత్యేకంగా స్టేడియంకి వచ్చే వారు ఎంతో మంది ఉన్నారు. చెపాక్ స్టేడియంలో మ్యాచ్ అంటే స్టాండ్స్‌లో ఎల్లో జెర్సీలు, జెండాలు తప్ప మరేవి కనిపించవు. సీఎస్కే మ్యాచ్ అంటే చాలు.. మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. . సోమవారం చెపాక్ వేదికగా కేకేఆర్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి 137/9 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని సులువుగా చేధించింది చెన్నై టీం. రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో సీఎస్కే విజయానికి చేరువైంది. అయితే జట్టు విజయానికి 3 పరుగులు అవసరమైన దశలో శివమ్ దూబే మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడూ 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే మహీ.. ఫ్యాన్స్ కోసం మూడు వికెట్లు పడ్డ వెంటనే గ్రౌండ్‌లోకి రావడంతో చెపాక్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆయన నడుచుకుంటూ వస్తుంటే తెగ గోల చేశారు.బ్యాటింగ్ చేస్తుంటే రచ్చ చేశారు. ధోనీపై చూపిన అభిమానుల ప్రేమకు హిట్టర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ధోనీ ఫ్యాన్స్ చేసిన అరుపులు, విజిల్స్ సౌండ్‌ను భరించలేక రసెల్ అయితే ఏకంగా చెవులు మూసుకున్నాడు. ధోనీ బౌండరీలైన్ దాటి బ్యాట్‌తో మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి మ్యాచ్ ముగేసి వరకు అదే జోష్ కొనసాగగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.