వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం షాక్‌

మాచర్ల వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం షాక్‌

విధాత : మాచర్ల వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయి గేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని శేషగిరిరావు పిటిషన్లలో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసంతో పాటు హత్యాయత్నం చేశారని.. తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజు కూడా ఆయన హింసకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దంటూ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేసింది.

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రీపోలింగ్‌ పిటిషన్ కొట్టివేత

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రిపోలింగ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని, ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం తాము ఇందులో జోక్యం చేసుకోలేమని, ఇందుకు తగిన కారణలేమి కనిపించడం లేదని స్పష్టం చేసింది. దీనిలో జోక్యం చేసుకునేందుకు కారణాలేమీ కనిపించట్లేదని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా పేర్కోంది