Kayadu Lohar: ఎవరీ కయదు లోహర్?.. ఒక్క సినిమాతో యూత్‌ను, సోషల్ మీడియాను ఊపేస్తోంది

  • By: sr    actress    Feb 25, 2025 3:01 PM IST
Kayadu Lohar: ఎవరీ కయదు లోహర్?.. ఒక్క సినిమాతో యూత్‌ను, సోషల్ మీడియాను ఊపేస్తోంది

Kayadu Lohar

విధాత: ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వినిపిస్తున్న, ట్రెండింగ్‌లో ఉంటున్న‌ పేరు కయదు లోహర్ (Kayadu Lohar). అస్సాం నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ 2021లో ముగిలిపేట్ అనే క‌న్న‌డ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆపై త‌మిళ‌, మ‌ల‌యాళ‌, మ‌రాఠి, తెలుగులో సౌత్ భాష‌ల‌న్నింటిలో ఒక్కో చిత్రంలో న‌టించింది.

2022లో శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ అల్లూరి సినిమాలో న‌టించినా అశించినంత గుర్తింపు రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఐదారు సినిమాల్లో మాత్ర‌మే న‌టించిన ఈ చిన్న‌ది ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ హాడావుడి చేస్తోంది. నిత్యం హాట్ ఫొటోషూట్ల‌తో నెట్టింట కాక‌ రేపుతోంది.

అంతేకాదు పక్షం రోజుల క్రితం తను నటించిన డ్రాగన్ (Dragon) సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌మిళ‌నాట ఓ టీవీ ఛాన‌ల్‌ నిర్వ‌హించిన కార్యక్రమంలో ఓ కుర్రాడు ఈ ముద్దుగుమ్మ‌కు లిప్ కిస్ చేయ‌బోవ‌డం పెద్ద ర‌చ్చ‌ అయింది. ఆపై డ్రాగన్ సినిమా నుంచి విడుదల చేసిన చేసిన స్టిల్స్‌, వీడియోల‌తో క్రమంగా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూ వచ్చింది.

పైగా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎలాంటి భేషజాలు లేకుండా తన అందాల ప్రదర్శణ ఫొటోలను షేర్ చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంది. త‌న ముగ్ద మనోహర రూపంతో ఇతరుల త‌లను తిప్పుకోనివ‌కుండా మెస్మ‌రైజ్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రు ఎవ‌రీ భామ అంటూ సెర్చ్ చేసేలా చేసింది.

గతవారం అమ్డుమడు నటించిన తమిళ చిత్రం డ్రాగ‌న్ అదే పేరుతో తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించడంతో పాటు కాయదు ఓవర్‌నైట్ స్టార్ డం సంపాదించుకుంది. దీంతో కుర్రకారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించే శోధిస్తున్నారు.

ఎవరీ బ్యూటీ ఇన్నాళ్లు ఏటు పోయింది, మనం ఎలా మిస్సయాం అంటూ తెగ వెదికేస్తున్నారు. అమ్మడి ఫొటోలను తమ ఫొన్లలో వాల్ పేపర్లుగా పెట్టుకుంటున్నారు. అమ్మడి ఫొటోలు షేర్ చేస్తూ కామెంట్లతో హడావుగి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా డ్రాగన్ సినిమా విజయం సాధించడంతో ఇతర భాషల నిర్మాతల, దర్శకులు, హీరోలు ఇప్పుడు కయదు లోహర్ (Kayadu Lohar) కాల్షీట్ల కోసం తిరుగుతున్నారంటే ఈ ముద్దుగుమ్మకు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందే ఇట్టే అర్ధమవుతుంది.

తాజాగా తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా జాతి రత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈ అమ్మడి జోరు చూస్తుంటే సైత్‌ను కొన్నాళ్లు యేలేసే విధంగానే కనిపిస్తోంది.