పోక్సో కేసుల సత్వర విచారణకు పదహారు ప్రత్యేక కోర్టులు
విధాత,అమరావతి: పోక్సో కేసుల సత్వర విచారణకు పదహారు ప్రత్యేక కోర్టుల పరిధిని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియా, మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి మిగతా జిల్లా.. గుంటూరు పరిధిలోకి గుంటూరు, గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు, తెనాలి ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెనాలి రెవెన్యూ డివిజన్, ఏలూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఏలూరు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు, భీమవరం పరిధిలోకి భీమవరం, నరసాపురం రెవెన్యూ డివిజన్ల ప్రత్యేక కోర్టుల […]

విధాత,అమరావతి: పోక్సో కేసుల సత్వర విచారణకు పదహారు ప్రత్యేక కోర్టుల పరిధిని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియా, మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి మిగతా జిల్లా.. గుంటూరు పరిధిలోకి గుంటూరు, గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు, తెనాలి ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెనాలి రెవెన్యూ డివిజన్, ఏలూరు ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఏలూరు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు, భీమవరం పరిధిలోకి భీమవరం, నరసాపురం రెవెన్యూ డివిజన్ల ప్రత్యేక కోర్టుల పరిధి ఖరారు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.