విశాఖకు 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు
విధాత,విశాఖపట్నం: సింగపూర్, బ్రూనై దేశాల నుంచి మొత్తం 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లను ఐ.ఎన్.ఎస్.జలాశ్వ యుద్ధనౌకలో ఆదివారం తూర్పు నౌకాదళ జెట్టీకి తీసుకువచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆయిల్, గెయిల్‌తోపాటు వివిధ సంస్థలు ఆయా క్రయోజనిక్ ట్యాంకులు, ఇతర కీలక ఉపకరణాలను భారత్‌కు తెప్పించాయని తెలిపారు. 18 క్రయోజనిక్ ట్యాంకులకుగానూ 15 ట్యాంకుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ఉందని వివరించారు. సముద్రసేతు-2 కార్యక్రమంలో భాగంగా యుద్ధనౌకల్లో ఆయా ట్యాంకులను రవాణా […]

విధాత,విశాఖపట్నం: సింగపూర్, బ్రూనై దేశాల నుంచి మొత్తం 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లను ఐ.ఎన్.ఎస్.జలాశ్వ యుద్ధనౌకలో ఆదివారం తూర్పు నౌకాదళ జెట్టీకి తీసుకువచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.
ఇండియన్ ఆయిల్, గెయిల్‌తోపాటు వివిధ సంస్థలు ఆయా క్రయోజనిక్ ట్యాంకులు, ఇతర కీలక ఉపకరణాలను భారత్‌కు తెప్పించాయని తెలిపారు. 18 క్రయోజనిక్ ట్యాంకులకుగానూ 15 ట్యాంకుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ఉందని వివరించారు. సముద్రసేతు-2 కార్యక్రమంలో భాగంగా యుద్ధనౌకల్లో ఆయా ట్యాంకులను రవాణా చేసే బాధ్యతను నౌకాదళం నిర్వహిస్తోందని వెల్లడించారు.