కాజ టోల్ ప్లాజా వద్ద 250 కిలోలు గంజాయి ప‌ట్టివేత‌

విధాత‌:గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని కాజ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం విశాఖపట్నం నుంచి తమిళనాడు లోని మదురైకు కారులో అక్రమంగా తరలిస్తున్న 250 కిలోలు గంజాయి ను మంగళగిరి రూరల్ పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ఉన్నతాధికారుల సమచారంతో పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ 28 డీఎఫ్ 1323 కారులో 250 కిలోల గంజాయిని గుర్తించి కారును సీజ్ చేసి ఓ వ్యక్తి ని అరెస్టు చేసి కోర్టు […]

కాజ టోల్ ప్లాజా వద్ద 250 కిలోలు గంజాయి ప‌ట్టివేత‌

విధాత‌:గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని కాజ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం విశాఖపట్నం నుంచి తమిళనాడు లోని మదురైకు కారులో అక్రమంగా తరలిస్తున్న 250 కిలోలు గంజాయి ను మంగళగిరి రూరల్ పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ఉన్నతాధికారుల సమచారంతో పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ 28 డీఎఫ్ 1323 కారులో 250 కిలోల గంజాయిని గుర్తించి కారును సీజ్ చేసి ఓ వ్యక్తి ని అరెస్టు చేసి కోర్టు కు హాజరుపరచనునట్లు డిఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. వారు వాడే కారు కూడా ఖరీదైన వాహనం కావటంతో దీనిపై అనుమానం కలగదన్న అపోహతో తీసుకుని వెళుతున్నట్లు తమ విచారణ లో తెలిసిందని కానీ రాబడిన సమాచారం పక్కగా ఉండటంతో గంజాయి తరలిస్తున్న వాహనం అరుళ్ పాండ్యస్ నిందితుడితో సహా అదుపులోకి తీసుకున్నమని నార్త్ సబ్ డివిజన్ డివిజన్ డిఎస్పీ దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఈ కేసు లో మంగళగిరి రూరల్ సిఐ భూషణం, ఎస్సై ఏడుకొండలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో ప్రతిభకనపరిచిన సిబ్బందిని అబినందించారు