చంద్రగిరి ప్రజల కోసం..70 లక్షల విలువైన అంబులెన్స్

విధాత:చంద్రగిరి,రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన రూ.70 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల ప్రయోజనార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అంబులెన్స్ వాహనం ఎదుట కొబ్బరికాయ కొట్టి హారతి పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం వేదికైంది. నా నియోజకవర్గ ప్రజారోగ్య రీత్యా […]

చంద్రగిరి ప్రజల కోసం..70 లక్షల విలువైన అంబులెన్స్

విధాత:చంద్రగిరి,రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన రూ.70 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల ప్రయోజనార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అంబులెన్స్ వాహనం ఎదుట కొబ్బరికాయ కొట్టి హారతి పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం వేదికైంది. నా నియోజకవర్గ ప్రజారోగ్య రీత్యా అడిగిన వెంటనే తన ఎంపీ నిధుల నుంచి సహకారం అందించిన రాజ్యసభ ఎంపీ
పరిమల్ నథ్వాని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నా నియోజకవర్గ ప్రజలను అత్యవసర పరిస్థితులలో అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు సరికొత్త టెక్నాలజీతో కూడిన అంబులెన్స్ వాహనం సంజీవినిలా పనిచేస్తుందన్నారు. ఈ వాహనంలో ఈసీజీ, బీపీ మోనిటర్, పల్స్ ఆక్సోమీటర్, ఆక్సిజన్ సదుపాయం తదితర టెక్నాలజీ సదుపాయాలు ఉన్నాయని తెలియజేశారు.

రాజ్యసభ ఎంపీ
పరిమల్ నథ్వాని ఎన్నిక సమయంలో సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జనరల్ ఏజెంట్ గా వ్యవహరించారు. ఈ సాన్నిహిత్యం మేరకు ప్రజల అవసరాలకు అంబులెన్స్ కావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి అడిగారు. అడిగిన వెంటనే రాజ్యసభ ఎంపీ పరిమల్ నథ్వాని అంబులెన్స్ వాహనాన్ని కేటాయించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి సబ్ కలెక్టర్ కనక నరసారెడ్డి, చంద్రగిరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జోత్స్న శ్రవంతి, డాక్టర్ శ్రీలక్ష్మీ, డాక్టర్ తులసి తదితరులు పాల్గొన్నారు..